SBI Debit Card: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అకౌంట్ ఉంటే ఈ విషయం తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేవారు డెబిట్ కార్డును జాగ్రత్తగా ఉంచుకోవడం ముఖ్యం. ఏదైనా పొరపాటు వల్ల ఏటీఎం కార్డు పోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ డెబిట్ కార్డు పోగొట్టుకుంటే వెంటనే డెబిట్ కార్డును బ్లాక్ చేసుకోవాలి. లేకుండా ఇతరులు మీ అకౌంట్‌ను ఖాళీ అయ్యే అవకాశం ఉంది. బ్యాంక్ డెబిట్ కార్డును బ్లాక్ చేసుకోవడానికి చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. కాల్ చేయడం, నెట్ బ్యాంకింగ్, SMS రూపంలో సులభంగా డెబిట్ కార్డును బ్లాక్ చేసుకోవచ్చు. మీ డెబిట్‌కార్డు పోగొట్టుకుంటే 1800112211 లేదా 1800 425 3800 నెంబర్లకు కాల్ చేసి బ్లాక్ చేసుకోవాలి. ఇవి టోల్ ఫ్రీ నెంబర్లు. మీ ఏటీఎం నెంబర్ సరిగ్గా గుర్తు లేకపోతే మీ ఫోన్ నంబర్, ఇతర వివరాలు తెలియజేసి కూడా కార్డును బ్లాక్ చేసుకోవచ్చు.
నెట్ బ్యాంకింగ్ ద్వారా..
నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఎస్‌బీఐ డెబిట్ కార్డును బ్లాక్ చేసుకోవచ్చు. ఇందు కోసం నెట్ బ్యాంకింగ్‌లోకి లాగిన్ కావాలి. తర్వాత ఇసర్వీసెస్ ఆప్షన్‌లోకి వెళ్లి అక్కడ ఏటీఎం కార్డు సర్వీసుల్లో బ్లాక్ ఏటీఎం కార్డు అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ కార్డుల చివరి నాలుగు, మొదటి నాలుగు అంకెలు కనిపిస్తుంటాయి. మీకు నచ్చిన కార్డును ఎంచుకొని దాన్ని బ్లాక్ చేసుకోవచ్చు. ఒక్కసారి బ్లాక్ చేస్తే మళ్లీ ఆ కార్డును తిరిగి పొందటానికి అవకాశం డదు. తర్వాత కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందే.
SMS ద్వారా:
ఇక ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా మీ ఏటీఎం కార్డును కూడా బ్లాక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు 567676 నెంబర్‌కు SMS చేయాల్సి ఉంటుంది. బ్లాక్ అని టైప్ చేసి కార్డు చివరి నాలుగు అంకెలు ఎంటర్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి. బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్ నుంచే SMS పంపాలి. ఈ విధంగా కూడా కార్డును బ్లాక్ చేసుకోవచ్చు.
బ్యాంకుకు వెళ్లి..
ఇక మీరు నేరుగా బ్యాంకుకు వెళ్లి మీ డెబిట్ కార్డును బ్లాక్ చేసుకోవచ్చు. బ్యాంక్ అధికారులను సంప్రదించి డెబిట్ కార్డు బ్లాక్ చేయడం కోసం రిక్వెస్ట్ చేస్తే బ్యాంకు సిబ్బంది బ్లాక్ చేస్తారు. ఇందు కోసం ఓ అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి