PM Krishi Sinchayee Yojana: డ్రిప్ ఇరిగేషన్ చేస్తే ప్రోత్సాహం.. ఏకంగా 90శాతం సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం.. పూర్తి వివరాలు..
డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని రైతులు పాటించేందుకు సబ్సిడీపై పరికరాలు అందజేస్తున్నారు. ఈ నూతనం విధానాన్ని రైతులు పాటించడం కోసం ఈ చర్యలు తీసుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను 90 శాతం సబ్సిడీపై ఇస్తున్నారు. రైతులు తమ సమీపంలోని వ్యవసాయాధికారులను సంప్రదించాలి.

మనది వ్యవసాయాధారిత దేశం. చాలా మంది పంటలు పండించి జీవనం సాగిస్తారు. దేశంలోని ప్రజలందరికీ తిండి లభించాలంటే సాగు చాలా కీలకం. దాని జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడే దేశం ముందుకు సాగుతుంది. పంటలు పండించడానికి భూమితో పాటు నీరు చాలా కీలకం. నీరు పూర్తిస్థాయిలో ఉన్నప్పుడే పంటలు బాగా పండుతాయి. సాధారణంగా కాలువల ద్వారా వచ్చిన నీటిని పొలాలకు పెద్ద ఎత్తున మళ్లిస్తారు. కాలువలు లేనిచోట్ల బోర్ల ద్వారా భూగర్భ జలాలను పైకి లాగి పొలాలకు నీరు పెడతారు. అయితే ఈ విధానాల్లో పొలానికి అవసరానికి మంచి నీరు అందిస్తున్నారు. మామూలుగా మొక్కల వేర్లకు నీరు అందితే సరిపోతుంది. కానీ ఇక్కడ మొక్కలతో పాటు పొలమంతా నీరు చేరుతుంది. దీనివల్ల పెట్టుబడి పెరగడంతో పాటు నీటి వనరులు తరిగి పోతున్నాయి.
నీటి వృథా అరికట్టేందుకు..
ముఖ్యంగా కూరగాయలు, ఉద్యాన పంటల సాగులో నీరు వృథా అవుతున్నట్టు వ్యవసాయ శాస్త్రవేత్తలు గమనించారు. ఈ తోటల సాగులో మొక్క వేరుకు నీరు అందిస్తే సరిపోతుందని గుర్తించారు. ప్రభుత్వం కూడా ఈ విషయంపై స్పందించింది. నీటి వృథాను అరికట్టేందుకు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో మొక్క మొదలుకు మాత్రమే నీరు చేరుతుంది. తద్వారా నీరు వృథా కాదు, దిగుబడి బాగుంటుంది. రైతులకు పెట్టుబడి తగ్గి ఆదాయం పెరుగుతుంది.
సబ్సిడీపై పరికరాలు..
డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని రైతులు పాటించేందుకు సబ్సిడీపై పరికరాలు అందజేస్తున్నారు. ఈ నూతనం విధానాన్ని రైతులు పాటించడం కోసం ఈ చర్యలు తీసుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను 90 శాతం సబ్సిడీపై ఇస్తున్నారు. రైతులు తమ సమీపంలోని వ్యవసాయాధికారులను సంప్రదించాలి.
ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన
బీహార్ రాష్ట్రంలోని జనాభాలో దాదాపు 85 శాతానికి వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ ఉద్యాన పంటలతో పాటు వరి, గోధుమ, శెనగ, ఆవాలను సాగు చేస్తారు. వీటి సాగుకు ఎక్కువ నీరు అవసరం. రైతులు తమ పొలాలను గొట్టపు బావుల ద్వారా నీరందిస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి, నీరు వృథాగా పోతోంది. దీని అరికట్టేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. పంటల సాగులో డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద రైతులకు 90 శాతం సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందజేస్తుంది. బీహార్ హార్టికల్చర్ డైరెక్టరేట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు.
రైతులకు అధిక ఆదాయం..
డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో పొలంలో సన్నని పైపులు ఏర్పాటు చేసి, వాటి ద్వారా నీటి సరఫరా చేస్తారు. నీరు చుక్కలు చుక్కలుగా మొక్కల మొదళ్లకు చేరుతుంది. పంటకు తగినంత నీరు అందుతుంది. ఈ విధానంలో దిగుబడి పెరుగుతుంది. రైతులకు 20 నుంచి 30 శాతం అధికంగా లాభాలు వస్తాయి. నీరు కూడా 60 శాతం నుంచి 70 శాతం వరకూ ఆదా అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




