Indian Railway: చెన్నై-హైదరాబాద్ మధ్య కొత్త రైల్వే ప్రాజెక్టు.. ప్రయాణికుల సమయం, ధనం రెండూ ఆదా..

ఇదే క్రమంలో కేంద్ర మంత్రి వర్గం మరో కీలకమైన అంశానికి గత వారంలో ఆమోదం తెలిపింది. అదేంటంటే చెన్నై-హైదరాబాద్ మధ్య, చెన్నై-కోల్‌కతా మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో సహాయపడే రెండు రైల్వే లైన్ల డబ్లింగ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా మరిన్ని రైళ్లను ఈ మార్గంలో తీసుకొచ్చేందుకు అవకాశం ఏర్పడుతోంది.

Indian Railway: చెన్నై-హైదరాబాద్ మధ్య కొత్త రైల్వే ప్రాజెక్టు.. ప్రయాణికుల సమయం, ధనం రెండూ ఆదా..
Indian Railways

Updated on: Feb 13, 2024 | 7:23 AM

భారతీయ రైల్వే కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త రైల్వే ప్రాజెక్టులు, కొత్త లైన్ల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న ట్రాక్ల ఆధునికీకరణతో ప్రయాణికులకు మెరుగైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు కృషిచేస్తోంది. ఇదే క్రమంలో కేంద్ర మంత్రి వర్గం మరో కీలకమైన అంశానికి గత వారంలో ఆమోదం తెలిపింది. అదేంటంటే చెన్నై-హైదరాబాద్ మధ్య, చెన్నై-కోల్‌కతా మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో సహాయపడే రెండు రైల్వే లైన్ల డబ్లింగ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా మరిన్ని రైళ్లను ఈ మార్గంలో తీసుకొచ్చేందుకు అవకాశం ఏర్పడుతోంది.

రూ. 32,500 కోట్ల వ్యయంతో ..

ఆంధ్రాలోని గుంటూరు నుంచి బీబీనగర్‌ వరకు 239కిలోమీటర్ల మార్గాన్ని డబ్లింగ్ చేయడం వల్ల చెన్నై-హైదరాబాద్ మార్గంలో 76కిలోమీటర్ల దూరం తగ్గుతుందని.. అదే విధంగా కటక్-విజయనగరం మార్గంలో ప్రతిపాదిత మూడో లైన్ ఆలస్యాలను తగ్గించడంతో పాటు మరిన్ని రైళ్లను ఆ మార్గంలో చేర్చుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గుంటూరు-బీబీ నగర్‌ మార్గాన్ని డబ్లింగ్‌ చేసేందుకు రూ. 3,238 కోట్ల వ్యయం అవుతుందని, చెన్నై-హైదరాబాద్‌ల మధ్య వందేభారత్‌ సర్వీసులతో సహా మరిన్ని రైళ్లను నడపడానికి ఇవి సహాయపడతాయని ఆయన చెప్పారు. ఈ మార్గంలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు, గూడ్స్ రైళ్లకు చాలా అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు.

ప్రస్తుతం, ఇది సింగిల్ లైన్ సెక్షన్ కావడంతో చాలా రద్దీగా ఉంది. బీబీ నగర్-గుంటూరు సెక్షన్‌లో చెన్నైకి వెళ్లే ఒక జత రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రయాణ సమయాన్ని ఒక గంట వరకు తగ్గించేలా కొత్త ట్రాక్ నిర్మాణం జరుగుతుందని కేంద్ర మంత్రి చెప్పారు. చెన్నైకి వెళ్లే ప్యాసింజర్ రైళ్లు, ఒక రేక్‌కు గూడ్స్ ధర దాదాపు రూ. 3-5 లక్షలు తగ్గుతుంది. ఈ లైన్‌లో సిమెంట్ ఉత్పత్తులు, ఇతర వస్తువుల ఉత్పత్తికి అధిక సామర్థ్యం ఉన్నందున ట్రాఫిక్ డిమాండ్ పెరుగుతుందన్న అంశాన్ని ఆయన నొక్కి చెప్పారు.

ఇవి కూడా చదవండి

కటక్-విజయనగరం మధ్య మూడో లైన్‌..

అదేవిధంగా, కటక్-విజయనగరం మధ్య మూడో లైన్‌ను నిర్మించే రూ.5,000 కోట్ల ప్రాజెక్టుకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. భద్రక్-విజయనగరం సెక్షన్‌లో నెరగుండి, బరంగ్ (22 కి.మీ), ఖుర్దా రోడ్-విజయనగరం (363 కి.మీ) మధ్య మూడో లైన్ నిర్మాణం జరగనుంది. ఇది తూర్పు-దక్షిణ ట్రంక్ మార్గం అయిన చెన్నై-కోల్‌కతా మార్గానికి ప్రయోజనం చేకూరుస్తుంది. వైజాగ్ నుంచి చెన్నై లైన్ కోసం వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక కూడా సిద్ధమవుతోందని మంత్రి వైష్ణవ్ చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..