Electric Bike: అసలుసిసలు కార్గో బైక్ ఇదే.. సింగిల్ చార్జ్‌పై 193 కిలోమీటర్లు.. 200 కేజీలను సైతం సునాయాసంగా..
కెనడాకు చెందిన ఈ-బైక్ తయారీ సంస్థ దోస్త్ ఇప్పుడు క్రేట్ కార్గో పేరిట ఓ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్ వెనుక వైపు సామగ్రి లేదా వస్తువులను పెట్టుకునేందుకు అధిక స్థలాన్ని కేటాయించి, కార్గో అవసరాల కోసం తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రకటించింది.

ఎలక్ట్రిక్ బైక్లు, స్కూటర్లకు మార్కెట్లో పోటీ ఏర్పడింది. అధిక ఫీచర్లతో పాటు, అధిక రేంజ్ కలిగిన వాటిని వినియోగదారులు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. అలాగే ఇటీవల కాలంలో కార్గో బైక్ లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. దీనిని అందిపుచ్చకునేందుకు గ్లోబల్ వైడ్ గా కంపెనీలు తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో కెనడాకు చెందిన ఈ-బైక్ తయారీ సంస్థ దోస్త్ ఇప్పుడు క్రేట్ కార్గో పేరిట ఓ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేసింది. కంపెనీ 2019 నుండి ఇ-బైక్‌లను తయారు చేస్తోంది. దోస్త్ క్రేట్ కార్గో ఎలక్ట్రిక్ బైక్ అనేది కంపెనీ నుంచి వచ్చిన తాజా మోడల్. ఈ బైక్ వెనుక వైపు సామగ్రి లేదా వస్తువులను పెట్టుకునేందుకు అధిక స్థలాన్ని కేటాయించి, కార్గో అవసరాల కోసం తీసుకొచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ బైక్ 440 పౌండ్ల బరువు అంటే దాదాపు 200 కేజీలను మోయగలుతుందని దోస్ట్ కంపెనీ ప్రకటించుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
అత్యంత ధృడంగా డిజైన్.. దోస్త్ కంపెనీ చెబుతున్న దాని ప్రకారం ఈ బైక్ పై ఒక రైడర్ తోపాటు ఇద్దరు చిన్న పిల్లలు లేదా పెద్దలను తీసుకెళ్లవచ్చు. దీనికి అదనంగా కొంత సామాను కూడా తీసుకెళ్లవచ్చు. దీని కోసం బలమైన, స్థిరమైన ప్లాట్ ఫారమ్ కలిగి ఉంది. బీఫీ స్క్వేర్-ట్యూబ్ 6061 అల్యూమినియం ఫ్రేమ్, దృఢమైన 6061 ఫోర్క్‌ను కలిగి ఉంది. బైక్‌లో ప్యాసింజర్ సీట్లు, ప్యానియర్‌లు, వెనుక బాస్కెట్ ఫ్రంట్ రాక్ వంటి ఉపకరణాలను మన ఎంపిక ఆధారంగా తీసుకోవచ్చు.
సూపర్ రేంజ్.. దోస్త్ క్రేట్ ఎలక్ట్రిక్ బైక్ రెండు బ్యాటరీ ఎంపికలలో అందుబాటులో ఉంది. సింగిల్ బ్యాటరీ సెటప్ ఒక చార్జ్‌పై 60 మైళ్ల (సుమారు 96 కి.మీ) పరిధిని అందిస్తుంది. రెండు బ్యాటరీల ఎంపికలో అయితే ఒకే ఛార్జ్‌పై 120 మైళ్ల (సుమారు 193 కిమీ) పరిధిని అందిస్తుంది. ఈ బైక్‌లో ఎన్వియోలో సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఇవ్వబడింది. కొత్త దోస్త్ ఇ-బైక్ బ్రేక్ లైట్, టైల్‌లైట్ హై, లో బీమ్ సెట్టింగ్‌లతో వస్తుంది. బైక్‌లో కిక్‌స్టాండ్ ఉంది. బైక్ బ్యాటరీ పరిస్థితి, రైడింగ్ మోడ్ , డిస్టెన్స్ ట్రావెల్డ్ వంటివి చూసుకునేందుకు మల్టీ కలర్ ఎల్సీడీ స్క్రీన్‌ను అందిస్తోంది.
సామర్థ్యం.. దోస్త్ ఇ-బైక్ 750వాట్ల అవుట్‌పుట్, 125ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. బఫాంగ్ M600 మిడ్-డ్రైవ్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ బైక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏటవాలు కొండలను అధిరోహించగలుగుతుంది. సులభమైన, మృదువైన పెడల్ అసిస్టెంట్ కోసం టార్క్ సెన్సార్‌ను అమర్చారు. అదే సమయంలో పెడలింగ్ రైడింగ్ సౌలభ్యాన్ని అందిస్తుంది.
ధర, లభ్యత.. దోస్త్ క్రేట్ యొక్క సింగిల్-బ్యాటరీ వెర్షన్ ధర 4,999 డాలర్లు అంటే మన కరెన్సలో దాదాపు రూ. 4,10,175. అదే డ్యూయల్ బ్యాటరీ సెటప్ అయితే 699 డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 57,354 అదనంగా ఖర్చు అవుతుంది. బైక్ కోసం ప్రీ-ఆర్డర్‌లను కూడా కంపెనీ స్వీకరిస్తోంది. 500 డాలర్లు అంటే దాదాపు రూ. 41,023 డిపాజిట్ చేసి బైక్ ను బుక్ చేసుకోవచ్చు. ఈ బైక్ డిసెంబర్ 2023 నాటికి డెలివరీలు ప్రారంభించే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







