Electric Scooter: రూ. 69,900కే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 120 కిలోమీటర్లు.. లుక్, ఫీచర్లు అదిరిపోయాయిగా..
గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. యాంపియర్ జీల్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఆటో మొబైల్ ఇండస్ట్రీ ఎలక్ట్రిక్ బాట పట్టింది. ఆ కంపెనీ, ఈ కంపెనీ అని లేదు, ఆ దేశం, ఈ దేశం అని లేదు. ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలే కనిపస్తున్నాయి. ఏదైనా ఒక వాహనం కొత్తగా లాంచ్ అయ్యింది అంటే అది ఎలక్ట్రిక్ దే అయ్యి ఉంటుంది. ముఖ్యంగా కార్లు, బైక్ లు, స్కూటర్ల శ్రేణిలో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. అయితే కొనుగోలు దారులు తమ బడ్జెట్ లెవెల్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ వాహనాలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేసింది. యాంపియర్ జీల్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ధర ఎంతంటే..
మీడియం స్పీడ్ రేంజ్ స్కూటర్లలో ఈ యాంపియర్ జీల్ ఈఎక్స్ బెటర్ ఆప్షన్ కానుంది. ఈ ఎలక్రిక్ స్కూటర్ ధర రూ. 69,900( ఎక్స్ షోరూం) గా గ్రీవ్స్ కంపెనీ ప్రకటించింది. అయితే ఇది కేవలం మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ లో మాత్రమే ఈ ధర అందుబాటులో ఉంటుంది. మిగిలిన రాష్ట్రంలో రూ. 75,000(ఎక్స్ షోరూం) ఉంటుంది. అంటే దాదాపు రూ.5,100 వరకూ ఎక్కువ ఉంటుంది. అయితే మార్చి 31 వరకూ ఈ స్కూటర్ కొనుగోలుపై దాదాపు రూ. 6,000 వరకూ తగ్గింపును అందిస్తామని ఆ కంపెనీ ప్రకటించింది.
వినూత్నమైన రైడింగ్ ఎక్స్ పీరియన్స్..
ఈ సందర్భంగా గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ బెల్ మాట్లాడుతూ తమ కొత్త ఉత్పత్తి యాంపియర్ జీల్ ఈఎక్స్ స్కూటర్ వినియోగదారులకు అద్భుతమైన రైడింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందని చెప్పారు. అత్యంత తక్కువ బడ్జెట్ లో దీనిని అందిస్తున్నట్లు చెప్పారు. దీని ఫీచర్లు, కంఫర్ట్, పెర్ఫార్మెన్స్, సేఫ్టీలో ఎక్కడా రాజీ పడలేదని చెప్పారు.
రేంజ్ ఇది..
యాంపియర్ జీల్ స్కూటర్ లో 2.3 kwh సామర్థ్యంతో కూడిన లిథియం బ్యాటరీ, అలాగే 1.8 kw వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. దీనిలో బ్యాటరీ ఒక్క సారి చార్జ్ చేస్తే ఏకంగా 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలుతుంది. అలాగే గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుతుంది. ఈ బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి ఐదు గంటలు సమయం పడుతుంది.
ఫీచర్లు ఇవి..
ఈ స్కూటర్ లో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, రెండు వైపులా డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ఈ బైక్ నాలుగు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. స్టోన్ గ్రే, ఐవోరీ, వైట్, ఇండిగో బ్లూ వంటి కలర్ వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..