FD Interest Rates: టాప్ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఇవి.. అత్యధికం ఎక్కడంటే..

మన దేశంలో టాప్ బ్యాంకులు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకుల్లో వడ్డీ రేట్లను ఒకసారి చూద్దాం. రూ. 2కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లపై ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్లను పోల్చితే.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లో డిపాజిట్ కాలపరిమితి, డిపాజిటర్ వయస్సు ఆధారంగా ఎఫ్డీపై 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఏటా 7.75 శాతం వరకు ఎఫ్‌డీ రేట్లను అందిస్తోంది. అదే సమయంలో ఎస్‌బీఐ సంవత్సరానికి 7.50 శాతం వరకు ఇస్తోంది.

FD Interest Rates: టాప్ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు ఇవి.. అత్యధికం ఎక్కడంటే..
Fixed Deposit
Follow us

|

Updated on: Mar 31, 2024 | 7:54 AM

సురక్షితమైన పెట్టుబడి పథకాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఒకటి. వీటిల్లో కచ్చితమైన రాబడితో పాటు మీ సొమ్ముకు భద్రత ఉంటుంది. అధిక వడ్డీ రేటు కూడా ఉంటుంది. పైగా ఇటీవల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు బ్యాంకులు పెంచుతూనే ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును యథాతథంగా కొనసాగించడమే. దీంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లు సౌకర్యవంతమైన మార్జిన్‌లో ద్రవ్యోల్బణాన్ని అధిగమించి ఆకర్షణీయంగా మారాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో టాప్ బ్యాంకులు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకుల్లో వడ్డీ రేట్లను ఒకసారి చూద్దాం. రూ. 2కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లపై ఈ బ్యాంకుల్లో వడ్డీ రేట్లను పోల్చితే.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లో డిపాజిట్ కాలపరిమితి, డిపాజిటర్ వయస్సు ఆధారంగా ఎఫ్డీపై 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఏటా 7.75 శాతం వరకు ఎఫ్‌డీ రేట్లను అందిస్తోంది. అదే సమయంలో ఎస్‌బీఐ సంవత్సరానికి 7.50 శాతం వరకు ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా బ్యాంకుల్లో పూర్తి వడ్డీ వివరాలను ఇప్పుడు చూద్దాం..

హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో తాజా వడ్డీ రేట్లు..

రూ. 2కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లపై హెచ్డీఎఫ్సీ బ్యాంకులో వార్షిక వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి
  • 7 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం
  • 30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం
  • 46 రోజుల నుంచి 6 నెలల లోపు: సాధారణ ప్రజలకు 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
  • 6 నెలల 1 రోజు నుంచి 9 నెలల లోపు: సాధారణ ప్రజలకు – 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
  • 9 నెలల 1 రోజు నుంచి 1 సంవత్సరం లోపు: సాధారణ ప్రజలకు – 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం
  • 1 సంవత్సరం నుంచి 15 నెలల లోపు: సాధారణ ప్రజలకు – 6.60 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.10 శాతం
  • 15 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 7.10 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
  • 2 సంవత్సరాల 1 రోజు నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ 11 నెలలు: సాధారణ ప్రజలకు – 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
  • 2 సంవత్సరాల 11 నెలల నుంచి 35 నెలల వరకు: సాధారణ ప్రజలకు – 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
  • 2 సంవత్సరాల 11 నెలల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకూ: సాధారణ ప్రజలకు – 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
  • 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.75

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఐసీఐసీఐ బ్యాంక్ తాజా వడ్డీ రేట్లు..

  • 7 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
  • 30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
  • 46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 4.75 శాతం
  • 61 రోజుల నుండి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
  • 91 రోజుల నుంచి 184 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.25 శాతం
  • 185 రోజుల నుంచి 270 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
  • 271 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు: సాధారణ ప్రజలకు – 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం
  • 1 సంవత్సరం నుంచి 15 నెలలలోపు: సాధారణ ప్రజలకు – 6.70 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.20 శాతం
  • 15 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు: సాధారణ ప్రజలకు – 7.20 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.75 శాతం
  • 2 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు – 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా వడ్డీ రేట్లు:

  • 7 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
  • 46 రోజుల నుంచి 179 రోజులు: సాధారణ ప్రజలకు – 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
  • 180 రోజుల నుంచి 210 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు – 5.75 శాతం
  • 211 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు: సాధారణ ప్రజలకు – 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
  • 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలలోపు: సాధారణ ప్రజలకు – 6.80 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.30 శాతం
  • 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలలోపు: సాధారణ ప్రజలకు – 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
  • 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు: సాధారణ ప్రజలకు – 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.00 శాతం
  • 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపు: సాధారణ ప్రజలకు – 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ