Post Office TD: పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్ ఇదే.. అధిక రాబడి.. పూర్తి భరోసా..

ఇటీవల కాలంలో బ్యాంకులు, ఇతర ప్రైవేటు ఆర్థిక సంస్థలకు దీటుగా పోస్ట్ ఆఫీసులు కూడా మంచి రాబడితో కూడిన పథకాలను తీసుకొస్తోంది. వాటిల్లో ఒకటి టైమ్ డిపాజిట్ స్కీమ్. మీకు మంచి రాబడితో పాటు మీ సొమ్ము భ్రదంగా ఉండాలనుకుంటే ఈ పోస్టాఫీసు స్కీమ్ బెస్ట్ ఆప్షన్. సామాన్యుల భాషలో చెప్పాలంటే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలా ఉంటుంది.

Post Office TD: పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్ ఇదే.. అధిక రాబడి.. పూర్తి భరోసా..
Post Office Scheme
Follow us
Madhu

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 22, 2024 | 8:26 PM

పోస్ట్ ఆఫీసు పథకాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అక్కడ పెట్టుబడి పెడితే పూర్తి భద్రత, ప్రభుత్వ భరోసా ఉంటుందని ప్రజల నమ్మకం. పైగా ఈ పోస్ట్ ఆఫీసు పథకాల్లో అధిక వడ్డీ కూడా వస్తుండటంతో అందరూ వీటికి మొగ్గుచూపుతున్నారు. అందుకనుగుణంగా పోస్ట్ ఆఫీసులో కూడా అనేక రకాల పథకాలను వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. ఇటీవల కాలంలో బ్యాంకులు, ఇతర ప్రైవేటు ఆర్థిక సంస్థలకు దీటుగా పోస్ట్ ఆఫీసులు కూడా మంచి రాబడితో కూడిన పథకాలను తీసుకొస్తోంది. వాటిల్లో ఒకటి టైమ్ డిపాజిట్ స్కీమ్. మీకు మంచి రాబడితో పాటు మీ సొమ్ము భ్రదంగా ఉండాలనుకుంటే ఈ పోస్టాఫీసు స్కీమ్ బెస్ట్ ఆప్షన్. సామాన్యుల భాషలో చెప్పాలంటే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలా ఉంటుంది. ఆ పథకాలతో సారూప్యత కారణంగానే దీనిని పోస్ట్ ఆఫీస్ ఎఫ్‌డీ అని కూడా పిలుస్తారు. దీనిలో 6.9 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీని కూడా పొందుతారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

టైమ్ డిపాజిట్ ప్లాన్‌ని ఉపయోగించి ఇన్వెస్టర్‌కి స్వల్పకాలిక, దీర్ఘకాలిక పెట్టుబడులు చేసే అవకాశం ఉంటుంది. మీరు ఈ పథకంలో ఒకటి, రెండు, మూడు లేదా ఐదేళ్ల పాటు డబ్బును డిపాజిట్ చేయవచ్చు. భారతదేశంలోని ఏ పౌరుడైనా పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ కోసం నమోదు చేసుకోవచ్చు. అలాగే ముగ్గురు పెద్దలు కలిసి ఉమ్మడి ఖాతాను తెరవొచ్చు. తల్లిదండ్రులు పది సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి పిల్లల పేరు మీద టైమ్ డిపాజిట్ ఖాతాను నమోదు చేసుకోవచ్చు. కనీసం రూ.1,000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు.

వడ్డీ రేటు ఇలా..

మీరు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్‌లో ఒక సంవత్సరం పాటు డబ్బును పెట్టుబడి పెట్టినట్లయితే, మీకు 6.9 శాతం వడ్డీ లభిస్తుంది. రెండేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే 7 శాతం వడ్డీ లభిస్తుంది. మూడేళ్లపాటు డబ్బును ఇన్వెస్ట్ చేస్తే, పెట్టుబడిదారుడికి 7.1 శాతం వడ్డీ, ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌పై 7.5 శాతం వడ్డీ వస్తుంది.

ఇవి కూడా చదవండి

పన్ను ప్రయోజనాలు..

పోస్టాఫీసులో 5 సంవత్సరాల కాల వ్యవధితో టైమ్ డిపాజిట్ ఖాతాలో పెట్టుబడి పెట్టని మొత్తానికి ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా లభిస్తుంది. 5 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధి ఉన్న డిపాజిట్లపై పన్ను ప్రయోజనాలు అందుబాటులో ఉండవు. టైమ్ డిపాజిట్, మెచ్యూరిటీకి ముందే డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు, కానీ పెనాల్టీ రుసుము వసూలు చేస్తారు.