TVS Jupiter vs Honda Activa 6G: ఈ రెండు స్కూటర్లలో ఏది బెస్ట్? స్పెక్స్, ఫీచర్స్, మైలేజీ ఇలా..
హోండా, టీవీఎస్ స్కూటర్లకు మనదేశంలో డిమాండ్ బాగుంది. ఈ కంపెనీల వాహనాలను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ కంపెనీల రకరకాల మోడళ్ల వాహనాలు విడుదలై ప్రజల ఆదరణ పొందాయి. ప్రస్తుతం హోండా యాక్టివా 6జీ, టీవీఎస్ జూపిటర్ స్కూటర్లు సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు స్కూటర్ల ప్రత్యేకతలను తెలుసుకుందాం.

ద్విచక్ర వాహనం అనేది ప్రజల కనీస అవసరంగా మారింది. మారుతున్న జీవన విధానానికి అనుగుణంగా ప్రతి కుటుంబానికీ తప్పనిసరి అయ్యింది. గతంలో కుటుంబ యజమాని ఉపయోగించుకునే వీలుగా మోటారుసైకిళ్లకు డిమాండ్ ఉండేది. ప్రస్తుతం మహిళలు కూడా ద్విచక్ర వాహనాలను ఎక్కువగా వాడుతున్నారు. ఈ నేపథ్యంలో మగ, ఆడవారికిద్దరికీ వీలుగా ఉండే స్కూటర్ల వినియోగం పెరిగింది. గేర్లు వాడకుండా సులువుగా నడిపే వీలు ఉండడం, పట్టణాల్లోని ట్రాఫిక్‌లో ఇబ్బంది లేకుండా వెళ్లడానికి స్కూటర్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి. హోండా, టీవీఎస్ స్కూటర్లకు మనదేశంలో డిమాండ్ బాగుంది. ఈ కంపెనీల వాహనాలను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ కంపెనీల రకరకాల మోడళ్ల వాహనాలు విడుదలై ప్రజల ఆదరణ పొందాయి. ప్రస్తుతం హోండా యాక్టివా 6జీ, టీవీఎస్ జూపిటర్ స్కూటర్లు సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు స్కూటర్ల ప్రత్యేకతలను తెలుసుకుందాం.
- టీవీఎస్ జూపిటర్ బేస్ వేరియంట్ రూ.77,750(ఎక్స్ షోరూం) నుంచి మొదలవుతుంది. హోండా యాక్టివా 6జీ రూ.76, 330(ఎక్స్ షోరూం)కు అందుబాటులో ఉంది. టాప్ మోడల్స్ పరంగా చూస్తే టీవీఎస్ జూపిటర్ రూ. 89,750(ఎక్స్ షోరూం), హోండా యాక్టివా 6జీ రూ. 82,730(ఎక్స్ షోరూం) వరకూ ఉన్నాయి.
- టీవీఎస్ జూపిటర్ లీటర్ పెట్రోల్‌కు 62 కిలోమీటర్లు, హోండా యాక్టివా 6జీ 66 కిలోమీటర్ల మైలేజీ ఇస్తాయి.
- జూపిటర్ లో సింక్రొనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. మనం బ్రేకు వేసినప్పుడు వాహనం స్థిరంగా ఆగుతుంది. అందువల్ల చక్కగా నియంత్రించవచ్చు. ఎత్తపల్లాల నేలపై కూడా వాహనాల నిలిపేందుకు వీలుగా పార్కింగ్ బ్రేక్ కూడా ఉంది. మరోవైపు యాక్టివాలో ఈక్వలైజర్ టెక్నాలజీ కలిగిన కాంబి బ్రేక్ సిస్టమ్ ఉంది. ఇది ముందు, వెనుక టైర్ల మధ్య బ్రేక్ ఫోర్స్‌ను సమానంగా పంపిణీ చేస్తుంది. బ్రేక్ వేసినప్పుడు వాహనం నియంత్రణలో ఉంటుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ కారణంగా సున్నితంగా నడపవచ్చు.
- జూపిటర్ ప్రిస్టైన్ వైట్, మిడ్‌నైట్ బ్లాక్, టైటానియం గ్రే, వోల్కనో రెడ్, సన్‌లిట్ ఐవరీ, రాయల్ వైన్, స్టార్‌లైట్ బ్లూ తదితర రంగులలో లభిస్తుంది. హోండా యాక్టివా గ్లిట్టర్ బ్లూ మెటాలిక్, పెర్ల్ ప్రెషియస్ వైట్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, బ్లాక్, పెర్ల్ స్పార్టన్ రెడ్, డాజిల్ ఎల్లో మెటాలిక్ తదతర కలర్లలో లభ్యమవుతుంది.
- జూపిటర్ లో 109.7 సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది 7.47బీహెచ్‌పీ శక్తి, 8.4 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక హోండా యాక్టివా ఇంజిన్ సామర్థ్యం109.51 సీసీ. 7.68 బీహెచ్‌పీ పవర్, 8.79 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
- టీవీఎస్ జూపిటర్ మైలేజీ బాగా ఇస్తుంది. దీనిలో సస్పెన్షన్ సిస్టమ్ కారణంగా ఎగుడుదిగుడు రోడ్లపైనా సౌకర్యంగా ప్రయాణం చేయవచ్చు. దీనిలో అండర్ సీట్ స్టోరేజ్ బాగుంది. దూరప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఉపయోగపడేలా విశాలమైన పెట్రోలు ట్యాంకు ఉంది. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఎకో, పవర్ మోడ్ ఇండికేటర్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్ తదితర అదనపు ఫీచర్లు ఉన్నాయి. అయితే ఇతర స్కూటర్లతో పోల్చితే జూపిటర్ అంత ఆకర్షణీయంగా లేదు. యాక్టివా 6జీ పోల్చితే కొంచె ధర ఎక్కువ. ముఖ్యమైన విషయం ఏమిటంటే రీసేల్ వాల్యూ చాలా తక్కువగా ఉంది.
- హోండా యాక్టివా 6జీకి ప్రజల ఆదరణ ఎక్కువ. దీనికి రీసేల్ వాల్యూ బాగుంది. సమర్థంగా పనిచేస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం సాగించవచ్చు. అయితే చార్జింగ్ పాయింట్ తదితర స్పెషల్ ఫీచర్లు లేవు. దీని డిజైన్ కూడా సాధారణంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ స్కూటర్ బరువుగా ఉండడం వల్ల హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




