Holi Celebrations: ఆకాశంలో హోలీ.. విమానంలో సంబరాలు.. అదిరింది..

దుబాయ్ లోని ఎమిరైట్ ఎయిర్ లైన్స్ విమానాల్లో మార్చి 24, 25 తేదీల్లో భారత దేశానికి ప్రయాణమైన వారికి ప్రత్యేక ఆతిథ్యం, విందు, వినోదాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రయాణికులకు హోలీ పండగ అనుభూతిని కల్పించింది. అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, కోల్‌కతాకు వెళ్లే ప్రయాణికులకు భారతీయ సంప్రదాయ స్వీట్లతో విందు ఇచ్చింది.

Holi Celebrations: ఆకాశంలో హోలీ.. విమానంలో సంబరాలు.. అదిరింది..
Holi Celebration On Flight
Follow us

|

Updated on: Mar 26, 2024 | 12:54 PM

ప్రపంచ వ్యాప్తంగా భారతీయులందరూ ఉత్సాహంగా జరుపుకోనే పండగ హోలీ. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో సందడిగా పండగ వేడుకలలో పాల్గొంటారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ డ్యాన్సులు చేస్తారు. విదేశాల్లో ఉండే చాలామంది హోలీ పండగ సందర్భంగా సొంత ఊళ్లకు వచ్చి వెళ్తుంటారు. ఇలాంటి వారి కోసం దుబాయ్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణ సమయంలోనూ పండగ జోష్ ను నింపుతూ గొప్ప అనుభూతిని ఇచ్చింది. ఇండియాకు రాకముందే హోలీ అనుభవాన్ని పొందారు. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఎమిరేట్స్ సర్వీస్ ను కొనియాడారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎమిరైట్ ఎయిర్ లైన్స్ లో ప్రత్యేక ఆతిథ్యం..

దుబాయ్ లోని ఎమిరైట్ ఎయిర్ లైన్స్ విమానాల్లో మార్చి 24, 25 తేదీల్లో భారత దేశానికి ప్రయాణమైన వారికి ప్రత్యేక ఆతిథ్యం, విందు, వినోదాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రయాణికులకు హోలీ పండగ అనుభూతిని కల్పించింది. అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, కోల్‌కతాకు వెళ్లే ప్రయాణికులకు భారతీయ సంప్రదాయ స్వీట్లతో విందు ఇచ్చింది. ఇందులో కేసర్ గుజియా, ప్రత్యేకంగా పాలు, డ్రై ఫ్రూట్స్ తయారుచేసిన వంటకాలు ఉన్నాయి. ఫస్ట్, బిజినెస్ క్లాస్ ప్రయాణీకులందరికీ చల్లని తండైతో పానీయంలో సాదర స్వాగతం పలికింది. ఇది పాలు, గింజలు, గులాబీ రేకులు, కుంకుమపువ్వుతో తయారు చేయబడిన ఒక రిఫ్రెష్ డ్రింక్. ఈ ఏర్పాట్ల ద్వారా భారతీయ ప్రయాణికులకు పండగ ఉత్సాహం పెంచేలా చేసింది.

పుష్కలంగా వినోదం..

ప్రయాణికులకు ప్రత్యేక పానీయాలు, ఆహార పదార్థాలతో విందు అందజేయడంతో పాటు వినోదానికి కూడా ఏర్పాటు చేసింది. హోలీ పండగ ఉత్సాహాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకుంది. ప్రయాణంలో వీక్షించడానికి 260 వరకూ ప్రముఖ భారతీయ సినిమాలు అందుబాటులో ఉంచింది. బాలీవుడ్ క్లాసిక్ నుంచి తాజా చిత్రాలతో పాటు ప్రాంతీయ చిత్రాలు కూడా ఉన్నాయి. అలాగే యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి మ్యూజిక్ వీడియోలను అదనంగా చూడవచ్చు. ఇవన్నీ మీ ప్రయాణంలో మధురానుభూతిని కలిగించాయి.

ఇవి కూడా చదవండి

ఆకాశంలో సంబరాలు..

ప్రయాణికులు హోలీ జరుపుకోవడానికి ఇంటికి వెళ్లకుండానే ప్రయాణంలో పండగ వాతావరణాన్ని ఆస్వాదించారు. విమానం ఎక్కింది మొదలు హోలీ జోష్ ప్రారంభమైంది. సిబ్బంది అతిథి మర్యాదలు, సంప్రదాయ స్వీట్లు, విందు, వినోదాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఇవన్నీ ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మార్చాయి. తద్వారా గాలిలోనే పండుగ సంబరాలు జరుపుకున్నట్లు అయ్యింది. ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
దేశంలో వేసవి విడిది కోసం ఎక్కువగా సెర్చ్‌ చేసిన ప్రదేశాలు ఇవే..
దేశంలో వేసవి విడిది కోసం ఎక్కువగా సెర్చ్‌ చేసిన ప్రదేశాలు ఇవే..
ఆ టైంలో నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..
ఆ టైంలో నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..
ఇంతకీ వేసవిలో గుడ్లు తినాలా, వద్దా..? ఆరోగ్య నిపుణుల సూచన ఏంటంటే!
ఇంతకీ వేసవిలో గుడ్లు తినాలా, వద్దా..? ఆరోగ్య నిపుణుల సూచన ఏంటంటే!
'నా ప్రపంచం ఇదే'.. సోషల్ మీడియా మీమ్స్‎పై సీఎం జగన్ స్పందన..
'నా ప్రపంచం ఇదే'.. సోషల్ మీడియా మీమ్స్‎పై సీఎం జగన్ స్పందన..
పవన్ కళ్యాణ్‎ను దత్తపుత్రుడు అనడానికి కారణం ఇదే.. సీఎం జగన్
పవన్ కళ్యాణ్‎ను దత్తపుత్రుడు అనడానికి కారణం ఇదే.. సీఎం జగన్
తల్లిదండ్రుల చిన్న ఏమరుపాటు ప్రాణాలు కోల్పోయే స్టేజ్‌కి చిన్నారి
తల్లిదండ్రుల చిన్న ఏమరుపాటు ప్రాణాలు కోల్పోయే స్టేజ్‌కి చిన్నారి
తెలంగాణలో వైఎస్ఆర్సీపీ విస్తరణపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
తెలంగాణలో వైఎస్ఆర్సీపీ విస్తరణపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
సైడ్ క్యారెక్టర్స్ నుంచి స్టార్ హీరోగా..
సైడ్ క్యారెక్టర్స్ నుంచి స్టార్ హీరోగా..
ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దంలోకి చూసుకుంటున్నారా..?
ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దంలోకి చూసుకుంటున్నారా..?
చార్ ధామ్ యాత్రలో ఏ దేవుళ్లను పూజిస్తారు? ప్రాముఖ్యత ఏమిటంటే
చార్ ధామ్ యాత్రలో ఏ దేవుళ్లను పూజిస్తారు? ప్రాముఖ్యత ఏమిటంటే