ఇటీవల కాలంలో విద్యుత్ శ్రేణి వాహనాల ధరలు పెరిగాయి. ప్రభుత్వాలు ఫేమ్ II సబ్సిడీలు తగ్గించడంతో వాటి ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఇప్పటికే ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలకు తోడు తక్కువ ధరలోనే లభ్యమయ్యేలా మరిన్ని వాహనాలను కంపెనీలు తీసుకొస్తున్నాయి. వాస్తవానికి మన దేశంలో విద్యుత్ శ్రేణి స్కూటర్లలో ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ టాప్ పొజిషన్లో ఉన్నాయి. అయితే వీటి పాత వేరియంట్ల ధరలు అధికంగా ఉండటంతో రెండూ తక్కువ ధరలో కొత్త వేరియంట్లను లాంచ్ చేశాయి. ఓలా ఎస్1 ఎయిర్, ఏథర్ 450ఎస్ పేర్లతో వాటిని మార్కెట్లోకి తీసుకొచ్చాయి. రెండూ అనువైన బడ్జెట్లోనే ఉన్నాయి. అయితే ఈ రెండింటిలో ఏది ఎంపిక చేసుకోవాలి? రేంజ్, డిజైన్, ఫీచర్లలో ఏది బెస్ట్? తెలుసుకుందాం రండి..
డిజైన్.. రెండింటి డిజైన్ బాగానే ఉంటుంది. ఒకదానికొకటి పోలికలు కూడా దగ్గరగానే ఉంటాయి. అయితే ఎస్1 ఎయిర్ సంప్రదాయ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ షాక్‌లు, 12-అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనుక ప్యానెల్‌ల వద్ద బ్లాక్-అవుట్ భాగాన్ని కలిగి ఉంటుంది. ఈ ఎస్1 ఎయిర్ కూడా అంతకు ముందు మోడల్ ఎస్1 ప్రో హెడ్‌లైట్ సెటప్‌ను పొందుతుంది, అయితే ఎస్1 ప్రో కంటే 13 కిలోల బరువు తక్కువగా ఉంటుంది. మరోవైపు ఏథర్ 450ఎస్ డిజైన్ దీని పాత మోడల్ 450ఎక్స్ మాదిరిగానే ఉంటుంది. ఇది మినిమలిస్టిక్ డిజైన్‌తో స్పోర్టీ స్టైలింగ్ ను కలిగి ఉంటుంది. 450ఎస్ లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు మోనోషాక్, ఎల్ఈడీ హెడ్‌లైట్లు, అల్లాయ్ వీల్స్ ఉంటాయి.
బ్యాటరీ సామర్థ్యం.. రేంజ్.. ఓలా ఎస్1 ఎయిర్ 3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని పొందుతుంది, అయితే గరిష్ట పవర్ అవుట్‌పుట్ 4.5కేడబ్ల్యూ వద్ద ఉంది. ఈ స్కూటర్ ఎకో మోడ్‌లో 125 కిమీ పరిధిని క్లెయిమ్ చేస్తుంది. బ్యాటరీ ప్యాక్‌ను 5 గంటల్లో పూర్తిగా చార్జ్ చేయవచ్చు. ఏథర్ 450 ఎస్ 3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. పూర్తి చార్జ్‌పై 115కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.
ఫీచర్ల వివరాలు.. ఓలా ఎస్1 ఎయిర్ హైపర్ మోడ్‌తో పాటు ఎస్1 ప్రో వేరియంట్లో ఉండే అన్ని లక్షణాలు ఉంటాయి. 34 లీటర్ల చిన్న బూట్ స్పేస్ ఉంటుంది. ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, టీఎఫ్టీ TFT డిస్ప్లే ఉంటుంది. మరోవైపు ఏథర్ కూడా కొన్ని ఫీచర్లను తగ్గించింది అయితే ఏయే ఫీచర్లు తగ్గించిందో క్లారిటీ లేదు. చిన్న డిస్ ప్లే తో పాటు ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా ఉండే అవకాశం ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..