HDFC Customers Alert: మీకు హెచ్‌డీఎఫ్‌సీలో అకౌంట్‌ ఉందా? ఈ సేవలు నిలిపివేత.. ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోండి

|

Aug 21, 2021 | 12:29 PM

HDFC Customers Alert: మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వినియోగదారులా..? అయితే ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాల్సిందే. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హె..

HDFC Customers Alert: మీకు హెచ్‌డీఎఫ్‌సీలో అకౌంట్‌ ఉందా? ఈ సేవలు నిలిపివేత.. ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోండి
Hdfc Bank
Follow us on

HDFC Customers Alert: మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వినియోగదారులా..? అయితే ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాల్సిందే. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులు వారాంతంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. బ్యాంకు తన కొన్ని సేవలను శనివారం నుండి ఆదివారం వరకు 18 గంటల పాటు నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ సమాచారాన్ని బ్యాంకు తన ఖాతాదారులకు ఇ-మెయిల్ ద్వారా పంపింది. డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యాలను మరింత మెరుగుపరచడానికి, బ్యాక్ మెయింటెనెన్స్ పని చేస్తుంది.

సేవలు ఏ సమయంలో నిలిచిపోతాయి..?

ఈ సేవలు 21 ఆగస్టు 2021 రాత్రి 9 గంటల నుండి 22 ఆగస్టు 2021 మధ్యాహ్నం 3 గంటల వరకు నిలిచిపోనున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తెలిపింది. ఖాతాదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని బ్యాంకు పేర్కొంది.

ఈ సేవలు పనిచేయవు

దీని కారణంగా ఈ సమయంలో, నెట్‌బ్యాంకింగ్ , మొబైల్‌బ్యాంకింగ్‌పై రుణ సేవలు నిలిచిపోనున్నాయి. అటువంటి పరిస్థితిలో, మీకు ఏదైనా ముఖ్యమైన పని ఉంటే, ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు చేసుకోండి. లేదంటే మీరు సోమవారం వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.

బ్యాంకు ఏం తెలిపిందంటే..

ప్రియమైన కస్టమర్, HDFC బ్యాంక్‌తో బ్యాంకింగ్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు , మీ ప్రియమైనవారు సురక్షితంగా ఉంటారని మేము ఆశిస్తున్నాము. మీకు ఉత్తమ డిజిటల్ బ్యాంకింగ్ అనుభవాన్ని అందించడానికి మా నిరంతర ప్రయత్నంలో భాగంగా, మేము షెడ్యూల్ చేయబడిన నిర్వహణలో ఉన్నాము. ఈ కార్యాచరణ సమయంలో, రుణ సంబంధిత సేవలు ప్రభావితం అవుతాయి. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాము.. అని తెలిపింది. దీంతో కస్టమర్లు ఈ విషయాన్ని గమనించి ముందస్తుగా అంటే ఈ రోజు సాయంత్రం 6 గంటల్లోపు పనులు చేసుకోవడం బెటర్‌.

ఇవీ కూడా చదవండి: SBI: ఎస్‌బీఐ తన వినియోగదారులకు హెచ్చరిక.. వీలైనంత త్వరగా ఈ పనిని పూర్తి చేసుకోండి.. లేకపోతే ఇబ్బందే..!

Credit Card: రూ.99కే క్రెడిట్ కార్డు.. బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..!