ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. ఇన్సూరెన్స్‌లలో కూడా రకరకాల పాలసీలు ఉంటాయి. వివిధ అవసరాలకు ఉపయోగపడతాయి. అయితే వివాహానికి కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. వివాహాన్ని ఆకస్మికంగా రద్దు చేయడం, విలువైన వస్తువులను దొంగిలించడం, వ్యక్తిగత ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు వంటి నష్టాలను కవర్ చేయడానికి వివాహ బీమా బెస్ట్ ఆప్షన్. పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైనది. ఖర్చుకు పరిమితి అంటూ ఏమి ఉండదు. ప్రతి ఒక్కరు వివాహాన్ని అంగరంగ వైభవంగా జరుపుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. చాలా కుటుంబాల్లో పెళ్లి కొరకు షాపింగ్ అనేది కనీసం ఒకటి రెండు నెలల ముందు నుంచే ప్రారంభం అవుతుంది. చాలా మంది హోటళ్లు, క్యాటరింగ్, బ్యూటీషియన్లను నెలల ముందుగానే బుక్ చేసుకుంటారు.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ప్రకారం… నవంబర్ 23 – డిసెంబర్ 15 మధ్య దేశంలో దాదాపు 38 లక్షల వివాహాలు జరుగనున్నట్లు అంచనా ఉంది. ఈ వివాహాల అంచనా వ్యయం దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు. Matrimony.com నివేదిక ప్రకారం… దేశంలో ప్రతి సంవత్సరం 1.1 నుండి 1.3 కోట్ల వివాహాలు జరుగుతాయి. కన్సల్టెన్సీ సంస్థ KPMG నివేదిక ప్రకారం… భారతదేశంలో వివాహ పరిశ్రమ విలువ 3.71 లక్షల కోట్ల రూపాయలు. ఇది వార్షికంగా పెరుగుతోంది. 25 నుండి 30 శాతం రేటు.
పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో దొంగతనం, దోపిడీ, అగ్నిప్రమాదం , ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబాలు పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు. వివాహ బీమా అనేది అటువంటి నష్టాలను భర్తీ చేస్తుంది. పర్సనల్ ఫైనాన్స్ నిపుణురాలు నిషా సంఘ్వి మాట్లాడుతూ… భారతదేశంలో వివాహ బీమా ఇంకా బాగా ప్రాచుర్యం పొందలేదు. ఈ బీమా ద్వారా వివాహ వేడుకల సమయంలో ఏవైనా అసహ్యకరమైన సంఘటనలు జరిగినా నష్టాలను కవర్ చేయవచ్చు. 20-30 లక్షల రూపాయలు వెచ్చించే పెళ్లి.. ఇందులో 1-1.5 శాతం బీమాపై ఖర్చు చేయడం ద్వారా అనేక రకాల ఆందోళనల నుంచి విముక్తి పొందవచ్చు. ద్రవ్యోల్బణం దృక్కోణంలో చూస్తే, ఇది చాలా చౌకైన ఎంపిక. అందుకే బీమా కవర్ తీసుకోవడం మంచిది. వివాహ బీమాలో ఎలాంటివి కవర్ అవుతాయో ఇప్పుడు చూద్దాం.
వివాహ బీమాలో రిస్క్ కవరేజ్ పరిధి కాలక్రమేణా పెరుగుతోంది. చట్టపరమైన లేదా నేరపూరిత సంఘటనల కారణంగా పెళ్లికి జరిగిన నష్టం బీమా కవర్‌లో చేర్చడం జరుగుతుంది. నగలు, బట్టలు లేదా ఇతర విలువైన వస్తువులు దొంగిలించినప్పునడు, బీమా కంపెనీ నష్టాన్ని తిరిగి చెల్లిస్తుంది. వర్షం, తుఫాను లేదా భూకంపం వల్ల జరిగే నష్టం కూడా కవర్ అవుతాయి. ఇప్పుడు బీమా కంపెనీలు వివాహ బీమా పాలసీలలో వ్యక్తిగత ప్రమాద రక్షణను కూడా ఇస్తాయి. ఈ పాలసీలో చేర్చబడిన వారికి పరిహారం అందుతుంది. ప్రమాదాల్లో ఎవరికైనా గాయాలు అయినా.. మరణాలు సంభవించినా కవర్ అవుతాయి. అయితే, వివాహ బీమా పాలసీలలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. అటువంటి నిబంధనల ఆధారంగా బీమా సంస్థలు మీ క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చు.
ఏదైనా వివాదాల కారణంగా వివాహ వేడుక రద్దు అయినట్లయితే అందుకు నష్టపోయిన మొత్తాన్ని బీమా కంపెనీ అందించదని గుర్తించుకోండి. అంతేకాదు వివాహ సమయంలో నిర్లక్ష్యం లేదా ఉద్దేశపూర్వకంగా నష్టం జరిగిందని బీమా సంస్థ భావిస్తే… పరిహారం అందించదు. ఆత్మహత్య లేదా ఆత్మహత్యాయత్నం లాంటివి జరిగి పెళ్లి ఆగిపోయినా బీమా కంపెనీ నష్టపరిహారం అందించదు. ఫ్యూచర్ జెనరాలి, ఐసిఐసిఐ లాంబార్డ్, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో, బజాజ్ అలయన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ వంటి కంపెనీలు వివాహ బీమాను విక్రయిస్తున్నాయి. బీమాదారులు ప్రస్తుతం చాలా తక్కువ మొత్తంలో క్లెయిమ్‌లను చెల్లిస్తున్నారు… ఇది ప్రీమియంను చౌకగా చేస్తుంది. ఈ పాలసీని కొనుగోలు చేయడానికి మీరు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి