AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harley Davidson X350: అతి తక్కువ ధరలో హార్లీ డేవిడ్సన్ బైక్.. లుక్, ఫీచర్స్‪లో ఎక్కడా తగ్గలేదుగా.. పూర్తి వివరాలు ఇవి..

లగ్జరీ బైక్ లలో హార్లీ డేవిడ్సన్ కూడా ఒకటి. కుర్రాళ్లు ఈ బ్రాండ్ బైక్ అంటే తెగ ఇష్టపడతారు. అయితే ఈ బ్రాండ్ బైక్ లు కాస్త ఎక్కువ ధర ఉంటాయి. కానీ హార్లీ డేవిడ్సన్ అతి తక్కువ ధరలో 350సీసీ బైక్ ను ఆవిష్కరించింది.

Harley Davidson X350: అతి తక్కువ ధరలో హార్లీ డేవిడ్సన్ బైక్.. లుక్, ఫీచర్స్‪లో ఎక్కడా తగ్గలేదుగా.. పూర్తి వివరాలు ఇవి..
Harley Davidson X350
Madhu
|

Updated on: Mar 14, 2023 | 3:27 PM

Share

లగ్జరీ కార్లలాగే.. లగ్జరీ బైక్ లు కూడా ఉన్నాయి. కుర్రాళ్లు కొన్ని రకాల హై ఎండ్ బైక్ లను చాలా ఇష్టపడతారు. వాటిల్లో హార్లీ డేవిడ్సన్ ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఈ బ్రాండ్ కు అమితమైన డిమాండ్ ఉంది. అలాగే రేటు కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకే సామాన్యులు ఆ బైక్ పై ఇష్టం ఉన్నా కొనుగోలు చేయడానికి జంకుతారు. సరిగ్గా అలాంటి వారి కోసమే హార్లీ డేవిడ్సన్ ఓ కొత్త బైక్ ను తీసుకొచ్చింది. హార్లీ డేవిడ్సన్ ఎక్స్350 (Harley-Davidson X350) పేరిట మోటార్‌సైకిల్‌ను లాంచ్‌ చేసింది. చైనాలో ఈ 350 సీసీ మోటార్‌సైకిల్ ధర 33,000 యువాన్లు అంటే మన కరెన్సీ లో సుమారు రూ.3.93 లక్షలు ఉంటుంది. హార్లీ డేవిడ్సన్ బైక్ లలో ఇదే అతి తక్కువ ధర కావడం విశేషం. ప్రస్తుతానికి చైనాలో మాత్రమే ఈ బైక్ అందుబాటులో ఉంది. త్వరలో మన దేశంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

చైనా కంపెనీ సాయంతో..

హ్యార్లీ డేవిడ్సన్‌ ఈ కొత్త బైక్ ను చైనా కంపెనీ క్యూజే మోటార్స్‌తో కలిసి సంయుక్తంగా రూపొందించింది. ఇప్పటికే భారత మార్కెట్లో మోటార్‌సైకిళ్లను విక్రయిస్తున్న బెనెల్లీ కూడా క్యూజే మోటార్స్ కు చెందినదే కావడం గమనార్హం..

స్పెసిఫికేషన్లు ఇవి..

హార్లీ డేవిడ్సన్‌ గతంలో ఉత్పత్తి నిలిపి వేసిన స్పోర్ట్‌స్టర్ ఎక్స్ఆర్1200ఎక్స్ ఆధారంగా ఈ కొత్త బైక్ హార్లీ డేవిడ్సన్‌ ఎక్స్350 బైక్‌ను తయారు చేశారు. ఇది సర్క్యులర్‌ హెడ్‌ ల్యాంప్‌ తో క్లాసిక్ లుక్‌ను అందిస్తోంది. ఇదే డిజైన్‌లో సర్క్యులర్‌ మోనోపాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా వస్తుంది. 350సీసీ టూ-వీలర్‌లో టియర్ డ్రాప్డ్ షేప్డ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది, ఇదే డిజైన్ ప్యాట్రన్ వెనుక భాగం వరకు కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

ఫీచర్లు ఇలా..

బైక్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, టెయిల్ లైట్లు అమర్చినట్లు తెలుస్తోంది. ముందువైపు అప్‌సైడ్ డౌన్ ఫోర్క్, వెనుక వైపు మోనో షాక్‌ను అందిస్తుంది. హార్లీ డేవిడ్సన్‌ మోటార్‌సైకిల్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. అల్లాయ్ వీల్స్ ముందు 120/70 టైర్, వెనుక 160/60 టైర్‌తో వస్తాయి.

సామర్థ్యం ఇలా..

హార్లీ డేవిడ్సన్‌ ఎక్స్350 బ్రేక్‌లో నాలుగు-పిస్టన్ కాలిపర్‌లతో ముందువైపు ఒకే డిస్క్ వస్తుంది. అదే విధంగా వెనుకవైపు సింగిల్-పిస్టన్ కాలిపర్‌తో ఒకే డిస్క్‌ ఉంటుంది. డిస్క్ బ్రేక్‌ల పరిమాణం ఇంకా తెలియదు. ఈ బైక్ 180 కిలోల బరువు ఉంటుంది. 353 సీసీ ప్యార్లల్‌-ట్విన్ ఇంజిన్‌ను ఈ బైక్‌లో పొందుపర్చింది. ఈ ఇంజన్ 36.2 బిహెచ్‌పి, 31 ఎన్ఎమ్ మోటార్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు. ఫ్యూయల్‌ ట్యాంక్ సామర్థ్యం 13.5 లీటర్లు. చైనాలో ఎక్స్ 350 బైక్‌ జాయ్‌ఫుల్ ఆరెంజ్, షైనింగ్ సిల్వర్, షాడో బ్లాక్ వంటి కలర్‌ ఆప్షన్‌లలో లభిస్తోంది.

మన దేశంలోకి ఎప్పుడంటే..

హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంతో హార్లీ డేవిడ్సన్‌ ఇండియన్‌ మార్కెట్లోకి మళ్లీ ప్రవేశించేందుకు కృషి చేస్తోంది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్లో మోటార్‌సైకిల్ విడుదలపై ఎటువంటి సమాచారం లేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అంతా రెడీ
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అంతా రెడీ
ఈ ప్రాంత అమ్మాయిల అందాన్ని చూస్తే గుండె జారీ గల్లంతే..!
ఈ ప్రాంత అమ్మాయిల అందాన్ని చూస్తే గుండె జారీ గల్లంతే..!
కాలీఫ్లవర్ లోని పురుగులను బయటకు రప్పించే ఈజీ పద్ధతి!
కాలీఫ్లవర్ లోని పురుగులను బయటకు రప్పించే ఈజీ పద్ధతి!
సొంతిల్లు కావాలనుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం తీపికబురు
సొంతిల్లు కావాలనుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం తీపికబురు
పవన్ సినిమాకు వెళ్లి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న టాలీవుడ్ హీరో
పవన్ సినిమాకు వెళ్లి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న టాలీవుడ్ హీరో
రామ్ చరణ్, ఎన్టీఆర్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్..
రామ్ చరణ్, ఎన్టీఆర్‏లతో బ్లాక్ బస్టర్ హిట్స్..
నీ డ్రామాలన్నీ వ్యూస్ కోసమేగా..? మహీని తిట్టిపోస్తున్న నెటిజన్లు
నీ డ్రామాలన్నీ వ్యూస్ కోసమేగా..? మహీని తిట్టిపోస్తున్న నెటిజన్లు
వామ్మో.. వెండి రూ.6 లక్షలా..! ఇది తెలిస్తే మీరు నోరెళ్లబెట్టడం..
వామ్మో.. వెండి రూ.6 లక్షలా..! ఇది తెలిస్తే మీరు నోరెళ్లబెట్టడం..
ఎట్టకేలకు రవితేజ కూడా వస్తున్నాడు.. ఎప్పుడంటే ??
ఎట్టకేలకు రవితేజ కూడా వస్తున్నాడు.. ఎప్పుడంటే ??
టీమిండియాకు మరో బ్యాడ్‌న్యూస్.. 2వ మ్యాచ్ నుంచి అభిషేక్ శర్మ ఔట్?
టీమిండియాకు మరో బ్యాడ్‌న్యూస్.. 2వ మ్యాచ్ నుంచి అభిషేక్ శర్మ ఔట్?