దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు గత తొమ్మిది రోజులుగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ అనంతరం పెట్రోల్‌కి బాగా డిమాండ్ పెరగడంతో.. ధరలను పెంచుతున్నాయి ఆయిల్ కంపెనీలు. తాజాగా చమురు ధరలపై లీటరుకు రూ.2 చొప్పున ధరలు పెంచుతున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆదాయ మార్గాలు సన్నగిల్లిన నేపథ్యంలో ఇలా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. పెరిగిన ఈ రోజు అర్థరాత్రి నుంచి ఈ పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ స్పష్టం చేశారు.
గుజరాత్‌లో సోమవారం నాటికి లీటర్ పెట్రోల్ ధర రూ.71.88 పైసలు, లీటర్ డీజిల్ ధర రూ.70.12గా ఉన్నాయి. మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలు రూ.73.88, రూ.72.12గా అయ్యాయి. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో ఆదాయ మార్గాలు సన్నగిల్లాయని తెలిపిన నితిన్ పటేల్.. ఇందులో భాగంగానే చమురు ధరలను పెంచినట్లు పేర్కొన్నారు.
Read More: