GST Rates: జీఎస్టీ విషయంలో నష్టపరిహారాల కోసం కేంద్రంపై ఆధారపడకుండా.. ఆదాయాలను పెంచుకోవాలని చాలా రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ఎందుకంటే.. త్వరలోనే కేంద్రం జీఎస్టీ అమలులోకి తెచ్చేటప్పుడు చెప్పిన పరిహారం అమలు గడువు ముగియనుంది. అందువల్ల వచ్చే నెలలో జరగనున్న సమావేశంలో 5 శాతం శ్లాబును తీసివేయాలనే దానిపై GST Council నిర్ణయం తీసుకోనుంది. ప్రజలు ఎక్కువగా వాడే కొన్ని ఉత్పత్తులను 3 శాతం శ్లాబులోకి, మరికొన్నింటిన్ని 8 శాతం పన్ను పరిధిలోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం GST వసూలులో నాలుగు టాక్స్ శ్లాబ్ రేట్లు అమలు జరుగుతోంది. అవేంటంటే.. 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం ట్యాక్స్ శ్లాబులు. అంతేకాక బంగారం, బంగార ఆభరణాలు 3 శాతం పన్ను కిందనున్నాయి. దీనికి తోడు అన్‌బ్రాండెడ్, అన్‌ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ జీఎస్టీ పరిధిలోకి రావటం లేదు.
ఆదాయాలను పెంచేందుకు వచ్చే నెలలో జరగబోయే సమావేశంలో.. టాక్స్ మినహాయింపు ఇస్తున్న వస్తువుల జాబితాను కుదించనున్నట్లు తెలుస్తోంది. కొన్ని నాన్ ఫుడ్ ఐటమ్స్‌ను 3 శాతం శ్లాబులోకి తీసుకురానున్నారు. అలాగే 5 శాతం శ్లాబ్ రేటును 7 లేదా 8 లేదా 9 శాతానికి పెంచాలని చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ అంశాలు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి. 5 శాతం శ్లాబ్ రేటు ఒక్క శాతం పెరిగినా.. ప్రభుత్వానికి అదనంగా రూ.50 వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఈ 5 శాతం పన్ను పరిధిలోని చాలా వస్తువులను 8 శాతం జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కౌన్సిల్ చూస్తోందని తెలుస్తోంది.
రాష్ట్రాలకు కేంద్రం ఇస్తోన్న జీఎస్టీ పరిహారాల విధానం జూన్ నెలతో ముగియనుంది. దీని వల్ల ఇకపై ఆదాయంలో వచ్చే లోటును సదరు రాష్ట్ర ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందుకు తగినట్లు ప్రత్యామ్నాయాలపై ఆలోచనలు చేస్తున్నాయి. ట్రేడ్, ఇండస్ట్రీ నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు పలుమార్లు జీఎస్టీ కౌన్సిల్ రేట్లను గతంలో తగ్గించింది. 28 శాతం పన్ను కిందకు వచ్చే వస్తువుల సంఖ్యను 228 నుంచి 35 కి తగ్గించింది. ఐదేళ్లకు మించి పరిహారాలను ఇవ్వబోమని కేంద్రం తేల్చిచెప్పడంతో.. రాష్ట్రాలే రెవెన్యూలను పెంచుకోవాలని భావిస్తున్నాయి. దీనికి గల ఒకే మార్గం పన్నులను పెంచడమని జీఎస్టీ కౌన్సిల్ ముందు తమ ప్రతిపాదనలను ఉంచాయి.
ఇవీ చదవండి..
Sri Lanka Crisis: కష్టాల కొలిమిలో లంక.. తాజాగా 5 రోజుల పాటు స్టాక్ మార్కెట్ బంద్.. ఎందుకంటే..
Economic crises: భారత్ చుట్టూ ముదురుతున్న సంక్షోభం.. ఇవి మన దేశంపై ప్రభావం చూపుతాయా..