Cooking Oil Price: సామాన్య ప్రజలకు తీపి కబురు అందబోతోందా..? అంటే అవుననే చెబుతున్నాయి నివేదికలు. వంట నూనె ధరలు రానున్న రోజుల్లో దిగి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వంట నూనె ధరలు మండిపోతున్నాయి. వీటి ధరలు దిగివస్తే ఎంతో మందికి ఊరట కలగనుంది. వంట నూనె ధర గత ఏడాదిగా రూ.55కుపైగా పెరిగింది. ఇప్పుడు లీటర్ నూనె ధర రూ.150కి చేరింది. దీంతో సామాన్యులపై చాలా భారం పడుతోంది. రూ.150 తీసుకెళ్తే లీటరు ఆయిల్ కూడా రావడం లేదు. దీంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడే పరిస్థితి ఉంది.
అయితే ఇప్పుడు వంట నూనె ధర తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాండ్లా, ముంద్రా పోర్ట్‌లలో నూనె స్టాక్ భారీగా నిలిచిపోయింది. ఈ స్టాక్‌కు అనుమతి లేకపోవడం వల్ల అలాగే పోర్ట్‌లలో చిక్కుకుపోయింది. ఇప్పుడు ఈ స్టాక్‌కు క్లియరెన్స్ వచ్చినట్లు సమాచారం. అంటే మార్కెట్‌లోకి ఎక్కువ నూనె అందుబాటులోకి రానుంది. దీని వల్ల నూనె ధరలు తగ్గే అవకాశాలున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. వంట నూనె కోసం భారత్ ఎక్కువగా దిగుమతిపై ఆధారపడింది. ప్రతి ఏడాది భారత్ వంట నూనె దిగుమతుల కోసం రూ.75వేల కోట్లను ఖర్చు చేస్తోంది. వంట నూనె ధర ఇప్పుడు రూ.150కు చేరింది. గత ఏడాది ఇది రూ.90 వద్ద ఉండేది. దీంతో ఇప్పుడు ధరలు తగ్గే అవకాశాలున్నాయని నివేదికల ద్వారా తెలుస్తోంది.