Indigo Airlines: విమాన ప్రయాణికులకు శుభవార్త.. టికెట్టు ధరలను భారీగా తగ్గించిన ఇండిగో..

విమాన ప్రయాణికులకు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తాము విమాన టికెట్ల రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో విమాన ప్రయాణం ఇకపై చవకగా మారనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎంత మే టికెట్ రేటు తగ్గనుంది? అసలు టికెట్ రేటుకు కేంద్ర నిర్ణయానికి సంబంధం ఏమిటి? తెలుసుకుందాం రండి..

Indigo Airlines: విమాన ప్రయాణికులకు శుభవార్త.. టికెట్టు ధరలను భారీగా తగ్గించిన ఇండిగో..
Indigo Airlines

Edited By: Shaik Madar Saheb

Updated on: Jan 06, 2024 | 8:08 PM

విమాన ప్రయాణికులకు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తాము విమాన టికెట్ల రేట్లను తగ్గిస్తున్నట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రకటించింది. దీంతో విమాన ప్రయాణం ఇకపై చవకగా మారనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎంత మే టికెట్ రేటు తగ్గనుంది? అసలు టికెట్ రేటుకు కేంద్ర నిర్ణయానికి సంబంధం ఏమిటి? తెలుసుకుందాం రండి..

మన దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఇండిగో ఒకటి. ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఇండిగో నడుస్తోంది. కాగా కేంద్ర ప్రభుత్వం ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌(ఏటీఎఫ్‌) ధరల తగ్గించింది. దీంతో ఇండిగో ఇప్పటికే టికెట్ల రేటులో కలిపి వసూలు చేస్తున్న ఇంధన చార్జీని ఇకపై నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 2023 అక్టోబర్లో జెట్‌ ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఈ ఇంధన చార్జీని జనవరి 4 నుంచి అంటే గురువారం నుంచి నిలుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ఏటీఎఫ్‌ ధరలు హెచ్చుతగ్గులు నమోదవుతున్న నేపథ్యంలో మార్కెట్‌ పరిస్థితిని బట్టి తాము చార్జీలను సర్దుబాటు చేస్తామని ఈ సందర్భంగా ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం ఏటీఎఫ్‌ ధర 4శాతం తగ్గడంతో ఇండిగో టికెట్‌ ధరను కూడా తగ్గించింది. ఈ క్రమంలోనే చమురుకంపెనీలు సైతం కమర్షియల్‌ గ్యాస్‌ సిలెండర్‌ ధరలను సైతం స్వల్పంగా తగ్గించింది.

ధరల తగ్గుదల ఇలా..

ఇంధన ఛార్జీలను తొలగించడం వల్ల ఇండిగో టికెట్ ధరలు తగ్గనున్నాయి. రూ.1,000 వరకూ దూరాలను బట్టి తగ్గింపు ఉంటుంది. 500 కిలోమీటర్ల దూరం వరకూ రూ. 300, 501-1,000 కిలోమీటర్ల దూరానికి రూ. 400, 1001-1500 కిలోమీటర్లకు రూ. 550, 1,501-2,500 కిలోమీటర్లకు రూ. 650, 2,501 కిలోమీటర్లకు రూ. 800 విధించింది. 3,500 కిలోమీటర్ల నుంచి 3,500 ఆపైన ఎంతైనా రూ. 1,000 ధర తగ్గతుంది.

ఇవి కూడా చదవండి

సంబంధం ఏమిటి..

జెట్ ఇంధనం లేదా విమానయాన టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్‌) ఖర్చులు క్యారియర్ కార్యాచరణ ఖర్చులలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉంటాయి. మొత్తం విమానం నిర్వహణలో దాదాపు 40శాతం ఈ జెట్‌ ఇంధనం ధరలు ఉంటున్నాయి. దీంతో ఆ భారాన్ని ప్రయాణికులపైనే వేస్తున్నాయి విమానయాన సంస్థలు. ఫలితంగా టికెట్ రేట్లలో ఇంధన చార్జీలను కలిపి వసూలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఏటీఎఫ్ చార్జీలు తగ్గడంతో టికెట్ల రేట్లను సైతం ఇండిగో తగ్గించింది. అంతేకాక ఈ తాజా తగ్గింపుతో ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన విమానయాన సంస్థలు కోలుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంధన భారం కొంతమేర తగ్గింది కాబట్టి విమానయాన సంస్థలకు కాస్త వెసులుబాటు ఏర్పడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..