UPI Users: మీ అకౌంట్ నుండి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అవుతున్నాయా? ఇలా ఆపేయండి!
UPI Users: నేటి డిజిటల్ యుగంలో, PhonePe, Google Pay, Paytm వంటి యూపీఐ యాప్‌లను ఉపయోగించే వారికి ఒక ముఖ్యమైన సమాచారం ఉంది. తరచుగా, ఓటీటీ యాప్‌లు, సిప్‌లు, సబ్‌స్క్రిప్షన్‌లు లేదా బీమా వంటి సేవలకు మనం యూపీఐ ఆటోపేను సెట్ చేస్తాం. అయితే, కాలక్రమేణా వీటిని మర్చిపోవడం ..

మీరు ఫోన్ పే (PhonePe), గూగుల్ పే (Google Pay), పేటీఎం (Paytm) వంటి యూపీఐ యాప్స్ వాడుతున్నారా? అయితే ఈ విషయం మీకు ఖచ్చితంగా తెలియాలి. లేదంటే మీ అకౌంట్ నుండి మీకు తెలియకుండానే డబ్బులు కట్ అయ్యే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి : D-Mart: డీమార్ట్‌కు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలిస్తే అవాక్కవుతారు.. రాధాకిషన్ దమానీనా మజాకా..!
అసలు సమస్య ఏమిటి?
చాలాసార్లు మనం కొన్ని సర్వీసుల కోసం (ఉదాహరణకు సబ్‌స్క్రిప్షన్లు) ‘ఆటో పే’ (Auto-pay) సెట్ చేసుకుంటాం. కానీ ఆ తర్వాత వాటిని క్యాన్సిల్ చేయడం మర్చిపోతాం. దీనివల్ల ప్రతి నెలా లేదా సంవత్సరానికి ఒకసారి మన పర్మిషన్ లేకుండానే ఆటోమేటిక్ గా అకౌంట్ నుండి డబ్బులు కట్ అవుతూ ఉంటాయి. అన్ని యూపీఐ యాప్స్‌లో మీరు సెట్ చేసిన ఆటో పే మాండేట్‌లను (Auto-pay Mandates) ఒకే చోట చూసి, వాటిని క్యాన్సిల్ చేసే అవకాశం ఇప్పుడు ఉంది. దీని కోసం ఈ క్రింది పద్ధతిని పాటించండి.
- మీరు ముందుగా యూపీఐ అధికారిక వెబ్‌సైట్ upihelp.npci.org.inను ఓపెన్ చేయండి.
- మీ ఫోన్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
- మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ (OTP)ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
- అక్కడ ‘Show My Auto-pay Mandates’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ యూపీఐ ఐడికి లింక్ అయి ఉన్న అన్ని ఆటో పే లిస్టులు కనిపిస్తాయి.
- మీకు అవసరం లేని వాటిని ‘Pause’ చేసుకోవచ్చు లేదా ‘Revoke’ (క్యాన్సిల్) చేసుకోవచ్చు.
దీనివల్ల ప్రయోజనం ఏమిటి?
ఇలా అనవసరమైన ఆటో పేమెంట్లను క్యాన్సిల్ చేయడం వల్ల మీ డబ్బు ఆదా అవుతుంది. అకౌంట్ లో బ్యాలెన్స్ మీకు తెలియకుండా తగ్గిపోకుండా ఉంటుంది.
Gold Price: శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




