FD Interest Rates: ఎఫ్‌డీ చేయాలనుకునే వారికి ఆ బ్యాంకు శుభవార్త… ఏకంగా 8.85 శాతం వడ్డీ ఆఫర్

|

Feb 28, 2024 | 3:00 PM

రెపో రేటు విషయంలో ఆర్‌బీఐ చర్యలతో ఈ పెంపునకు కొంతమేర బ్రేక్ పడినా కొన్ని బ్యాంకులు మాత్రం వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచుతూ ఉన్నాయి. తాజాగా ప్రముఖ బ్యాంక్ ఆర్‌బీఎల్  తన బ్యాంకులో 2 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తాలకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటును సవరించింది. సవరించిన ఎఫ్‌డీ రేట్లు వడ్డీ రేట్లు ఫిబ్రవరి 14, 2024 నుండి అమలులోకి వచ్చాయి.

FD Interest Rates: ఎఫ్‌డీ చేయాలనుకునే వారికి ఆ బ్యాంకు శుభవార్త… ఏకంగా 8.85 శాతం వడ్డీ ఆఫర్
Business Idea
Follow us on

భారతదేశంలో పెట్టుబడిదారులు నమ్మకమైన రాబడినందించే వివిధ పథకాల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ముందు వరుసలో ఉంటాయి. అయితే ఇటీవల కారణంగా ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యల కారణంగా ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా రెపో రేటు విషయంలో ఆర్‌బీఐ చర్యలతో ఈ పెంపునకు కొంతమేర బ్రేక్ పడినా కొన్ని బ్యాంకులు మాత్రం వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచుతూ ఉన్నాయి. తాజాగా ప్రముఖ బ్యాంక్ ఆర్‌బీఎల్  తన బ్యాంకులో 2 కోట్ల రూపాయల కంటే తక్కువ మొత్తాలకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటును సవరించింది. సవరించిన ఎఫ్‌డీ రేట్లు వడ్డీ రేట్లు ఫిబ్రవరి 14, 2024 నుండి అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్‌బీఎల్ బ్యాంకు వడ్డీ రేట్లు ఏ స్థాయిలో సవరించిందో? ఓ సారి చూద్దాం.

ఆర్‌బీఎల్ బ్యాంక్ అత్యధిక వడ్డీ రేట్లు ఇలా

ఆర్‌బీఉల్ బ్యాంక్ 18 నెలల నుంచి 24 నెలల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై అత్యధికంగా 8.10 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అదే ఎఫ్‌డీ పదవీకాలంలో సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం అదనంగా వడ్డీ అందిస్తారు. అంటే 8.60 శాతం నుంచి 9.21 శాతం వరకూ వడ్డీ వస్తుంది. ఈ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేటును అందిస్తాయి. సూపర్ సీనియర్ సిటిజన్లు (80 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ) సాధారణ ఎఫ్‌డీ రేటు కంటే 0.75 శాతం అదనపు వడ్డీ రేటు వస్తుంది. సూపర్ సీనియర్ సిటిజన్లు 18 నెలల నుంచి 24 నెలల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై అత్యధిక వడ్డీ రేటు 8.85 శాతానికి అర్హులని ఇది సూచిస్తుంది.

ఆర్‌బీఎల్ బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లు

7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీల కోసం సాధారణ పౌరులకు ఆర్‌బీఎల్ బ్యాంక్ 3.5 శాతం నుంచి 8.10 శాతం మధ్య వడ్డీ రేట్లను అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు 4 శాతం నుంచి 8.60% మధ్య మారుతూ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ప్రీమెచ్యూర్ పెనాల్టీ

ఆర్‌బీఎల్ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం “ఫిక్స్‌డ్ డిపాజిట్‌కు సంబంధించిన అకాల పూర్తి/పాక్షిక ఉపసంహరణపై డిపాజిట్ ఉంచిన తేదీకి వర్తించే రేటుకు, డిపాజిట్ నిర్వహించబడే కాలానికి వడ్డీ చెల్లిస్తారు. బ్యాంక్ అటువంటి రేటుపై 1 శాతం ఫెనాల్టీకి లోబడి ఉంటుంది. అయినప్పటికీ సీనియర్ సిటిజన్లు/సూపర్ సీనియర్ సిటిజన్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లను అకాల ఉపసంహరణకు ఎలాంటి జరిమానా లేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…