Fixed Deposits: ఆ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త.. ఎఫ్‌డీలపై అమల్లోకి వచ్చిన తాజా వడ్డీ రేట్లు

ముఖ్యంగా ఆర్థిక సంవత్సరం చివరిలో పెట్టుబడులను ఆకర్షించడానికి వివిధ బ్యాంకులు వివిధ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే కొత్త ఆర్థిక సంవత్సరంలో కొన్ని బ్యాంకులు కొత్త వడ్డీ రేట్లను ప్రకటించాయి. ఇదే కోవలోకి కెనరా బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. కెనరా పెంచిన వడ్డీ రేటును మార్చి 5 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది.

Fixed Deposits: ఆ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త.. ఎఫ్‌డీలపై అమల్లోకి వచ్చిన తాజా వడ్డీ రేట్లు
Fixed Deposits
Image Credit source: TV9 Telugu

Edited By: Janardhan Veluru

Updated on: Apr 06, 2023 | 4:10 PM

సాధారణంగా కష్టపడి సంపాదించిన సొమ్మును నమ్మకమైన రాబడి కోసం వివిధ సాధనాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటాం. ముఖ్యంగా అందరూ పెట్టుబడి అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనే ఆధారపడతారు. ఇటీవల ఆర్‌బీఐ రెపో రేట్లను పెంచడంతో అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సంవత్సరం చివరిలో పెట్టుబడులను ఆకర్షించడానికి వివిధ బ్యాంకులు వివిధ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే కొత్త ఆర్థిక సంవత్సరంలో కొన్ని బ్యాంకులు కొత్త వడ్డీ రేట్లను ప్రకటించాయి. ఇదే కోవలోకి కెనరా బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లను ప్రకటించింది. కెనరా పెంచిన వడ్డీ రేటును మార్చి 5 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఈ ప్రకటన మాత్రం ఆర్‌బీఐ మానిటరీ పాలసీ 2023 ముగింపునకు ఓ రోజు ముందు మాత్రం ప్రకటించడం గమనార్హం. దీంతో ఈ మార్పు గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియలేదు. కెనరా బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లను రూ.2 కోట్ల లోపు వరకూ పెంచింది. ఎఫ్‌డీ వడ్డీ రేట్లలో మార్పు చేసిన తర్వాత కెనరా బ్యాంక్ ఏడు రోజుల నుంచి పదేళ్ల వరకూ కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై పెంచిన వడ్డీ రేట్లను అందిస్తుంది. ఇది సాధారణ ప్రజలకు 4 శాతం నుంచి 7.25 శాతం వరకూ ఉన్నాయి. అయితే సీనియర్ సిటిజన్లకు 4 శాతం నుంచి 7.75 శాతం వరకూ ఉంటుంది.

పెంచిన వడ్డీ రేట్లు ఇలా

7 నుంచి 45 రోజుల పాటు డిపాజిట్ చేసిన వారికి వయస్సుతో సంబంధం లేకుండా 4.06 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. 40 నుంచి 90 రోజుల డిపాజిట్‌ అయితే 5.35 శాతం వడ్డీ వస్తుంది. రూ.15 లక్షలు పైబడిన డిపాజిట్లకు 5.41 శాతం వడ్డీ రేటు వస్తుంది. 90 నుంచి 179 రోజుల డిపాజిట్లకు 5.61 శాతం, రూ.15 లక్షలు దాటితే 5.67 శాతం వడ్డీ వస్తుంది. 180 నుంచి 269 రోజుల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 6.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం వడ్డీ అందిస్తుంది. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకూ 6.87 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.20 శాతం వడ్డీ వస్తుంది. కెనరా బ్యాంక్ ప్రకారం నాన్-కాల్ టర్మ్ డిపాజిట్లను అకాల ఉపసంహరణ అనుమతించని డిపాజిట్లుగా నిర్వచిస్తుంది. కెనరా ట్యాక్స్ సేవర్ డిపాజిట్ స్కీమ్ (జనరల్ పబ్లిక్) కోసం బ్యాంక్ 6.70 శాతం వడ్డీని అందిస్తుంది. అయితే ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే గరిష్ట డిపాజిట్ రూ. 1.50 లక్షలు మాత్రమే. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం