Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FD Rates Comparison : పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. అమల్లోకి వచ్చిన పెరిగిన రేట్లు.. ఏ బ్యాంక్ ఎంత ఇస్తుందంటే..

ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటును సవరించిన తర్వాత వివిధ బ్యాంకులు తమ వద్ద డిపాజిట్ చేసిన వారికి అందించే వడ్డీ బాగా పెంచాయి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగింపునకు చేరుకున్న నేపథ్యంలో అన్ని బ్యాంకులు కొత్త వడ్డీ రేట్లను అమల్లోకి తీసుకువచ్చాయి.

FD Rates Comparison : పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్.. అమల్లోకి వచ్చిన పెరిగిన రేట్లు.. ఏ బ్యాంక్ ఎంత ఇస్తుందంటే..
Fixed Deposit
Follow us
Srinu

|

Updated on: Mar 22, 2023 | 11:45 AM

జీవితాంతం కష్టపడి సంపాదించుకునే డబ్బును నమ్మకమైన రాబడి కోసం వృద్ధులు ఎక్కువగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెట్టుబడి పెడుతూ ఉంటారు. అలాగే మధ్యతరగతి ప్రజలు కూడా ఎక్కువగా ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటును సవరించిన తర్వాత వివిధ బ్యాంకులు తమ వద్ద డిపాజిట్ చేసిన వారికి అందించే వడ్డీ బాగా పెంచాయి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగింపునకు చేరుకున్న నేపథ్యంలో అన్ని బ్యాంకులు కొత్త వడ్డీ రేట్లను అమల్లోకి తీసుకువచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్‌ను 6.50 శాతంగా నిర్ణయించింది. రూ.2 కోట్ల వరకూ దేశీయ డిపాజిట్లపై ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు దేశంలోని కొన్ని ఇతర బ్యాంకులు ప్రస్తుత వడ్డీ రేట్లను మూడు శాతం నుంచి 7.75 శాతం వరకూ పెంచాయి. రెపో రేట్ల పెంపు వల్ల ఇప్ఫుడు ఎఫ్‌డీల వల్ల ఆకర్షనీయమైన వడ్డీ రేట్లను పొందవచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. పెరిగిన కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రధాన బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్ల మధ్య వ్యత్యాసాన్ని ఓ సారి తెలుసుకుందాం. 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

భారతదేశంలో ఉన్న అతి పెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ ఫిబ్రవరి 15, 2023న రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీపై వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన వడ్డీ రేట్ల ప్రకారం సాధారణ ప్రజలకు 3 శాతం నుంచి 7.10 వరకూ లబ్ధి చేకూరుతుంది. అయితే సీనియర్ సిటిజన్లు అయితే 3.50 శాతం నుంచి 7.60 శాతం వరకూ లబ్ధి పొందుతారు. పెంచిన వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య కాలానికి వర్తిస్తాయి. ఎస్‌బీఐ 400 రోజుల్లో మెచ్యూర్ అయ్యేలా అమృత్ కలష్ అనే ప్రత్యేక పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ పథకంలో సాధారణ ప్రజలు 7.10 శాతం వడ్డీ రేట్ పొందితే సీనియర్ సిటిజన్లు 7.60 శాతం వడ్డీ రేట్‌ను పొందుతారు. 

బ్యాంక్ ఆఫ్ బరోడా

ప్రముఖ ప్రభుత్వ రంగ రుణదాత బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది. ఈ రేట్లు 17 మార్చి 2023 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ బ్యాంక్ సాధారణ ప్రజలకు 3 శాతం నుంచి 7.05 శాతం వరకూ వడ్డీ రేట్లను అందించనుంది. అయితే సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం నుంచి 7.55 శాతం వరక వడ్డ అందిస్తుంది. ఈ వడ్డీ రేట్ గరిష్టంగా రూ.2 కోట్ల వరకూ డిపాజిట్ చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది. 

ఇవి కూడా చదవండి

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) కూడా రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీ రేట్లను అందించే జాబితాలో మూడో స్థానంలో ఉంది. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం యూబీఐ 25 నవంబర్, 2022 నుంచి పెరిగిన వడ్డీ రేట్లను అమల్లోకి తెచ్చింది. యూబీఐ 7 రోజు నుంచి 10 సంవత్సరాల కాలానికి ఎఫ్‌డీలపై 3 శాతం నుంచి 7.30 శాతం వరకూ అందిస్తాయి. సీనియర్ సిటిజన్లకు అయితే సాధారణ ప్రజలకు వర్తించే వడ్డీ రేట్ల కంటే అదనం 0.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..