Fixed Deposits: ఎఫ్‌డీ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ బ్యాంకుల్లో నమ్మలేని వడ్డీ

|

Sep 25, 2024 | 5:00 PM

భారతదేశంలో చాలా ఏళ్లుగా ఫిక్స్‌డ్ డిపాజిట్లల్లో పెట్టుబడిని నమ్మకమైన పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. ముఖ్యంగా పెట్టుబడికి నమ్మకమైన రాబడిని పొందవచ్చే నమ్మకంతో ఎక్కువ మంది ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెడుతున్నారు. అయితే ఎఫ్‌డీలో స్థిరమైన ఆదాయం పొందడానికి మాత్రమే అవకాశం ఉండడంతో కొంత మంది కొన్ని ప్రత్యేక పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బ్యాంకులు డిపాజిట్లను ఆకర్షించేందుకు వివిధ ప్రత్యేక పథకాలను రూపొందించాలని కూడా సూచించారు.

Fixed Deposits: ఎఫ్‌డీ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ బ్యాంకుల్లో నమ్మలేని వడ్డీ
Fixed Deposits
Follow us on

భారతదేశంలో చాలా ఏళ్లుగా ఫిక్స్‌డ్ డిపాజిట్లల్లో పెట్టుబడిని నమ్మకమైన పెట్టుబడి సాధనంగా చూస్తున్నారు. ముఖ్యంగా పెట్టుబడికి నమ్మకమైన రాబడిని పొందవచ్చే నమ్మకంతో ఎక్కువ మంది ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెడుతున్నారు. అయితే ఎఫ్‌డీలో స్థిరమైన ఆదాయం పొందడానికి మాత్రమే అవకాశం ఉండడంతో కొంత మంది కొన్ని ప్రత్యేక పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బ్యాంకులు డిపాజిట్లను ఆకర్షించేందుకు వివిధ ప్రత్యేక పథకాలను రూపొందించాలని కూడా సూచించారు. తాజాగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను భారీ 50 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) తగ్గించడంతో ప్రపంచవ్యాప్తంగా రేటు తగ్గింపు చక్రం ప్రారంభమైనప్పటికీ ఆహార ద్రవ్యోల్బణం కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ ఇప్పటికీ తన రెపో రేటును యథాతథంగా ఉంచాలని భావిస్తోంది. అయితే గత రెండేళ్లలో బ్యాక్-టు-బ్యాక్ రేట్లను పెంచిన తర్వాత నాలుగు బ్యాంకులు ప్రస్తుతం సంవత్సరానికి 8 శాతం కంటే ఎక్కువ వడ్డీను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే బ్యాంకులు ఎఫ్‌డీలపై అధిక వడ్డీను అందిస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం. 

బంధన్ బ్యాంక్ ఎఫ్‌డీలపై 3 శాతం 8.05 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు అనేవి డిపాజిట్ వ్యవధి, పర్సనల్ క్రెడిట్ రిస్క్‌కు అనుగుణంగా అందిస్తున్నారు. ఆర్‌బీఎల్ బ్యాంక్ సంవత్సరానికి 8.10 శాతం, ఎస్‌బీఎం బ్యాంక్ ఇండియా 8.25 శాతం రిటర్న్స్ ఇస్తుండగా, యస్ బ్యాంక్ సంవత్సరానికి 8 శాతం ఆఫర్ చేస్తోంది. అయితే ఈ నాలుగు బ్యాంకుల్లో సీనియర్ సిటిజన్లు ఎఫ్‌డీ చేస్తే సంవత్సరానికి 0.5 శాతం అదనపు వడ్డీ రేటును అందిస్తున్నారు. 

బ్యాంక్ ఎఫ్‌డీను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో తెరవవచ్చు. బ్యాంకును సందర్శించి, కేవైసీ నిబంధనలను నెరవేర్చడం ద్వారా ఎఫ్‌డీ ఖాతాను ఆఫ్‌లైన్‌లో తెరవవచ్చు. ఎఫ్‌డీ ఖాతాను కేవలం రూ. 100తో తెరవవచ్చు. అయితే ఈ మొత్తం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల మధ్య మారే అవకాశం ఉంది. ఎఫ్‌డీలను 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు తెరవవచ్చు. డిపాజిట్‌దారులు మెచ్యూరిటీకి ముందే నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇలా చేస్తే పెనాల్టీ వర్తించే అవకాశం ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..