AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Card: ఆధార్ కార్డు వాడేవారికి కేంద్రం అదిరిపోయే న్యూస్.. ఇకపై అది ఫ్రీ.. ఎప్పుడైనా చేసుకోవచ్చు..

ఆధార్ కార్డు యూజర్లకు యూఐడీఏఐ శుభవార్త అందించింది. ఉచితంగా ఈమెయిల్ ఐడీ అప్డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటివరకు రూ.75 రుసుం చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కొత్త ఆధార్ యాప్ ద్వారా ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. కొత్త ఆధార్ యాప్ ద్వారా ఎలా చేసుకోవాలంటే..

Aadhaar Card: ఆధార్ కార్డు వాడేవారికి కేంద్రం అదిరిపోయే న్యూస్.. ఇకపై అది ఫ్రీ.. ఎప్పుడైనా చేసుకోవచ్చు..
Aadhaar App
Venkatrao Lella
|

Updated on: Jul 04, 2026 | 7:00 AM

Share

ఆధార్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌కు ఈమెయిల్ ఉచితంగా లింక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. జులై 1వ తేదీ నుంచి అందుబాటులోకి రాగా.. డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ సదుపాయం అమల్లో ఉంటుంది. ఆరు నెలల పాటు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. అయితే కేవలం ఆధార్ యాప్ ద్వారా చేసుకుంటే మాత్రమే ఇది వర్తిస్తుంది. అదే ఆధార్ సెంటర్లు, వెబ్ సైట్ ద్వారా చేసుకోవాలంటే రూ.75 ఫీజు చెల్లించాలి. ఆధార్ యాప్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యూఐడీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఎంఆధార్ స్థానంలో కేంద్రం కొత్త ఆధార్ యాప్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

మెయిల్ ఐడీ లింక్ చేయడం వల్ల లాభాలు..

ఇప్పటివరకు మీ ఆధార్‌కు మెయిల్ ఐడీ లింక్ కాకపోతే కొత్తగా యాడ్ చేయాలన్నా లేదా ఇప్పటికే ఉన్న మెయిల్ ఐడీ మార్చుకోవాలన్నా ఉచితంగా చేసుకోవచ్చు. మీరు ఆధార్ సెంటర్లకు వెళ్లకుండా కొత్త యాప్ ద్వారా సులువుగా నిమిషాల్లోనే ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. జులై 1న ప్రారంభమవ్వగా.. రెండు రోజుల్లో రెండున్నర లక్షల మంది ఉచితంగా మెయిల్ ఐడీ అప్డేట్ చేసుకున్నారు. మొబైల్ నెంటర్ పనిచేయని సమయంలో ఆధార్ ఓటీపీలు పొందేందుకు ఈమెయిల్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఆధార్ అలర్ట్స్ సలువుగా పొందవచ్చు. దీంతో ఉచిత సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని యూఐడీఏఐ పేర్కొంది.

ఈమెయిల్‌ ఎలా అప్‌డేట్ చేయాలి?

– లేటెస్ట్‌ ఆధార్‌ యాప్‌లో లాగిన్‌ అవ్వండి

-సర్వీసెస్‌ విభాగంలోకి వెళ్లండి

– ఇ-మెయిల్‌ ఐడీ ఆప్షన్‌ సెలక్ట్ చేసుకోండి

-మీ ఇ-మెయిల్‌ ఐడీ ఎంటర్ చేయండి

– మెయిల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి

-ఫేస్‌ అథంటికేషన్‌ పూర్తి చేయడంతో అప్‌డేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

-ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌ స్లిప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి

కొత్త ఆధార్ యాప్‌ డౌన్ లోడ్స్

ఇక కొత్త ఆధార్ యాప్ జనవరిలో లాంచ్ అవ్వగా.. ఇప్పటివరకు 3.1 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు 40 లక్షల మంది మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోగా.. 10 లక్షల మంది అడ్రస్ అప్డేట్ చేసుకున్నారు.

Follow Us