సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..! వేచి చూడాల్సిందే..

బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి సామాన్యులకు పెను భారాన్ని మోపుతున్నాయి. పెళ్లిళ్లు, పండుగలకు ఆభరణాలు కొనుగోలు చేసేవారికి ఇది పెద్ద సవాలుగా మారింది. ప్రపంచ ఆర్థిక అస్థిరత, పెరుగుతున్న డిమాండ్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు బంగారాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. వెండి ధరలు కూడా రికార్డు స్థాయికి చేరాయి.

సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..! వేచి చూడాల్సిందే..
Gold Rates

Updated on: Jan 13, 2026 | 9:48 PM

నేటి ధరలు బంగారం, వెండి ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. పెళ్లిళ్లు, పండుగల వంటి ప్రత్యేక సందర్భాల్లో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే లేదా పెట్టుబడి పెట్టే వారికి షాక్ ఇస్తున్నాయి. గతేడాది కాలంగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రికార్డు స్థాయిలో లక్షన్నర వద్దకు చేరాయి. ప్రపంచ ఆర్థిక అస్థిరత, పెట్టుబడిదారుల నుండి పెరిగిన డిమాండ్, సరఫరా లేకపోవడం ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ధరలు వేగంగా పెరగడం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. పెట్టుబడి కోణం నుండి బంగారం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, ఆభరణాలు కొనుగోలు చేసేవారికి ఇది పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో సామాన్యులకు బంగారాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తుందని తెలిసింది. మరోవైపు, వెండి మార్కెట్లో ఆశ్చర్యకరమైన పెరుగుదల కనిపించింది. వెండి ధరలు 6శాతం పెరిగి రూ.2.65లక్షలకు చేరుకోగా, బంగారం కూడా ఆల్‌టైమ్‌ గరిష్టస్థాయి రూ.1.44లక్షలకు చేరుకుంది. శాతం భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో వెండి దాని మునుపటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ఇరాన్, వెనిజులా, గ్రీన్‌ల్యాండ్‌లో కొనసాగుతున్న కార్యకలాపాల కారణంగా, పరిశ్రమ నుండి డిమాండ్ కారణంగా ఈ తెల్ల లోహం నిరంతరం పెరుగుతోంది.

ఈ క్రమంలోనే ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ వెండి ధరలకు ఆశ్చర్యకరమైన టార్గెట్ ధరను ఇచ్చింది. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని సూచిస్తుంది. మార్కెట్లో వెండికి డిమాండ్ ఎక్కువగా ఉండటం, సరఫరా తక్కువగా ఉండటం ధర పెరుగుదలకు ప్రధాన కారణం. బంగారం, వెండి ధరల పెరుగుదల పెట్టుబడిదారులకు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, సామాన్యులకు ఇది ఆందోళన కలిగించే విషయం. ఈ కారణంగా, బంగారం కొనుగోలును సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలు, ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రభుత్వ ఈ నిర్ణయాలు రాబోయే రోజుల్లో సామాన్యులకు నిజంగా సహాయపడతాయో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి