Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Silver Price Today: దేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు మహిళలు. ఎంత ధర పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. ఇక ఉక్రెయిన్‌-రష్యా దాడుల..

Gold Silver Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం, వెండి ధరలు
Follow us

|

Updated on: Apr 30, 2022 | 6:03 AM

Gold Silver Price Today: దేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు మహిళలు. ఎంత ధర పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. ఇక ఉక్రెయిన్‌-రష్యా దాడుల నేపథ్యంలో పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. తాజాగా దిగి వచ్చాయి. శుక్రవారం (ఏప్రిల్‌ 29)న దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల బంగారం ధరపై రూ.450 నుంచి రూ.500 వరకు తగ్గుముఖం పట్టగా, కిలో వెండి పై రూ.1250 వరకు దిగి వచ్చింది. అయితే బంగారం, వెండి ధరలు పెరిగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

☛ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,370 ఉంది.

☛ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,370 వద్ద ఉంది.

☛ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370 ఉంది.

☛ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,900 వద్ద ఉంది.

☛ ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370 వద్ద కొనసాగుతోంది.

☛ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370 ఉంది.

☛ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370 ఉంది.

☛ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,370 వద్ద ఉంది.

వెండి ధరలు..

ఇక బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.63,800 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.69,000 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.69,000 ఉండగా, చెన్నైలో రూ.69,000 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.63,800 వద్ద ఉండగా, బెంగళూరులో రూ.69,000 ఉంది. ఇక కేరళలో రూ.69,000 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

PM Kisan: పీఎం కిసాన్‌ లబ్ధిదారులకి హెచ్చరిక.. ఆ పనిచేస్తే వెంటనే అధికారులని కలవండి..!

Pension Scheme: ఈ పథకంలో చేరి ప్రతి నెలా రూ.100 డిపాజిట్ చేయండి.. ఆ తర్వాత రూ.3000 పెన్షన్‌ పొందండి