బడ్జెట్ నుంచి దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో హైస్పీడ్‌తో దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం నేల చూపులు చూస్తున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గుతుంది. శుక్రవారం (సెప్టెంబర్ 5) భారత బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలో తగ్గుదల ఉంది. వెండి ధరలో కూడా అదే బాటలు కొనసాగుతుంది. తులంపై స్వల్పంగా అంటే వంద రూపాయల వరకు తగ్గింది. దేశీయంగా 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.72,750 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,680 వద్ద కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లోబంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
బ్యాంక్ ఆఫ్ అమెరికా ముందు, అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ కూడా రాబోయే కాలంలో బంగారం ధరలు పెరగబోతున్నాయని, అందుకే పెట్టుబడిదారులు ఈ విలువైన మెటల్‌పై విశ్వాసం ఉంచాలని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. 2025 ప్రారంభం నాటికి బంగారం ధరలు ఔన్సుకు $2,700కు చేరుకోవచ్చని గోల్డ్‌మన్ సాచ్స్ అభిప్రాయపడింది. అటువంటి పరిస్థితిలో భారతదేశంలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 81000 అవుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇది కూడా చదవండి: Gold Rates: మహిళలకు పండగే.. అప్పుడు రికార్డ్.. ఇప్పుడు పతనం.. రూ.3,722 తగ్గింపు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి