Gold Price: బంగారం ప్రియులకు షాక్‌..రాబోయే రోజుల్లో రూ. 60 వేలకు చేరనున్న బంగారం ధర.. నిపుణులేమంటున్నారు..!

|

May 03, 2021 | 1:41 PM

Gold Silver Price:కరోనా మహమ్మారి కారణంగా దేశంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి దిగి వస్తోంది. అయితే ఈ ధరలు తగ్గింపు..

Gold Price: బంగారం ప్రియులకు షాక్‌..రాబోయే రోజుల్లో రూ. 60 వేలకు చేరనున్న బంగారం ధర.. నిపుణులేమంటున్నారు..!
Follow us on

Gold Silver Price:కరోనా మహమ్మారి కారణంగా దేశంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి దిగి వస్తోంది. అయితే ఈ ధరలు తగ్గింపు ఎంత కాలం నిలవదని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో భారీగా పెరిగే అవకాశాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అయితే ఏప్రిల్‌ నెలలో 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,602 వరకు పెరిగింది. మార్చి 31న 10 గ్రాముల బంగారం ధర రూ.44,190 ఉంది. అయితే మే నెలకు సంబంధించి బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్న బంగారం ఇదే నెల నుంచి పెరిగే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు.

వెండి ధర కూడా..

ఇక వెండి ధరల్లో కూడా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. వెండి కిలోపై రూ.1,352 మేర తగ్గగా రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలున్నాయి.

దీపావళి నాటికి రూ.60 వేల వరకు ..

దేశంలో కరోనా సంక్షోభం కారణంగా అస్థిరత మరియు అనిశ్చిత వాతావరణం ఉందని మార్కెట్‌ నిపుణులు అంటున్నారు. ఇక ఇదే సమయంలో ద్రవ్యోల్బణం కూడా పెరగడం ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీపావళి నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ. 60వేలు దాటిపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం దిగి వస్తున్న బంగారం ధరలు..రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశాలున్నాయని కొందరు చెబుతుండగా, తాజాగా మాత్రం దీపావళీ నాటికి భారీగా పెరిగే అవకాశాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి వాతావరణం ఉందని నిపుణులంటున్నారు. అయితే గత ఏడాది ఆగస్టులో 10 గ్రాముల ధర రూ.56, 200 రికార్డు స్థాయికి చేరగా, ముందు ముందు ఇదే విధమైన పెరుగుదల కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే యూఎస్‌ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు 1,773 డాలర్లపైన ట్రేడవుతోంది. కాగా, రిటైల్‌ మరియు టోకు ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతాయి. ఏది ఏమైనా రానున్న రోజుల్లో బంగారం భారీగా పెరిగే అవకాశాలున్నాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఇవీ కూడా చదవండి:

Gold Price Today: దేశీయంగా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. దేశంలో ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

మ్యూచువల్‌ ఫండ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారా..? రూ.10 వేలతో రూ.5 లక్షలు.. అదిరిపోయే స్కీమ్‌..