AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: బంగారం కొనాలనుకునేవారికి భారీ ఊరట.. ధరలు ఒక్కసారిగా పతనం.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తులం ఎంతంటే..?

బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత మూడు వారాలుగా పతనమవుతూనే ఉన్నాయి. దీంతో కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయంగా నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో గోల్డ్ సేల్స్ పెరుగుతున్నాయి. ఇక వెండి ధరలు కూడా పతనమవుతున్నాయి. గత కొంతకాలంగా సిల్వర్ కూడా క్రాష్ అవుతోంది.

Gold Prices: బంగారం కొనాలనుకునేవారికి భారీ ఊరట.. ధరలు ఒక్కసారిగా పతనం.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తులం ఎంతంటే..?
Gold Prices
Venkatrao Lella
|

Updated on: Sep 10, 2026 | 6:22 AM

Share

గోల్డ్ ప్రియులకు ఊరట కలిగింది. ధరలు మరోసారి డౌన్ అవుతున్నాయి. గత మూడు వారాలుగా పసిడి దిగొస్తోంది. పెళ్లిళ్ల సీజన్ కావడం, త్వరలో వినాయక చవితి, దసరా పండగలు రానున్న క్రమంలో గోల్డ్ రేట్లు పతనమమవుతుండటం కొనుగోలు చేయాలనుకునేవారికి ఉపశమనం కల్గిస్తోంది. డాలర్ విలువ బలపడటం, అంతర్జాతీయంగా ఆర్ధిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం భయాల క్రమంలో ధరలు క్రాష్ అవుతున్నాయి. అయితే ఈ ధరల పతనం అనేది ఎన్ని రోజులు ఉంటుందని ఎవరూ అంచనా వేయలేమని మార్కెట్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల అంచనాలపై స్పష్టత రావడం లేదు. దీంతో బంగారం ధరల్లో ఎప్పుడైనా మార్పులు జరగొచ్చని అనలిస్టులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరలు క్రాష్ అవ్వడంతో.. దేశీయంగా కూడా కుప్పకూలాయి. సెప్టెంబర్ 10వ తేదీన దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం.

బంగారం ధరలు ఇవే..

-దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,300 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,440గా ఉంది.

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,54,300గా ఉండగా.. 22 క్యారెట్లు చూస్తే రూ.1,41,440 వద్ద ట్రేడవుతోంది.

-చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,54,300, 22 క్యారెట్ల రేటు రూ.1,41,440గా కొనసాగుతోంది.

-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,54,450 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,590గా ఉంది

-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.రూ.1,54,300 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,41,440 పలుకుతున్నాయి.

వెండి రేట్లు ఇవే..

వెండి ధరలు కూడా పతనమయ్యాయి. గత కొద్ది రోజులుగా స్దిరంగా కొనసాగుతున్న ధరలు.. గురువారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,49,900 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.2.50 లక్షలుగా ఉంది.

-హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,54,900 వద్ద ఉండగా.. నిన్న రూ.2.55 లక్షలు పలికాయి

-చెన్నైలో కిలో సిల్వర్ ధర రూ.2,54,900 వద్ద ట్రేడవుతోంది.

-ఢిల్లీలో కేజీ వెండి రూ.2,49,900గా ప్రస్తుతం ఉండగా.. బుధవారం రూ.2.50 లక్షల వద్ద స్థిరపడింది

Follow Us