గత కొద్ది రోజులుగా బంగారం ధరలు హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతున్నాయి. ఒకరోజు పసిడి ధరలు పెరిగితే.. మరుసటి రోజు తగ్గుతూ పసిడి ప్రేమికులకకు ఊరట కలిగిస్తున్నాయి. ఇక దీపావళికి ముందుగా బంగారం ధరలు బంగారం ప్రియులకు షాకిస్తున్నాయి. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. నిన్న (అక్టోబర్ 29న) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పసిడి ధరలలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక ఈరోజు (అక్టోబర్ 30న) బంగారం ధరలలో ఎలాంటి మార్పు రాలేదు. గోల్డ్ రేట్స్ స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 47,050 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 48,050కి చేరింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలలో ఎలాంటి మార్పులు జరగలేదు. హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు ఉదయం పసిడి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,850 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,930కు చేరింది. అలాగే ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,000కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 51,270కు చేరింది. అలాగే విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,850 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,930కు చేరింది. ఇక ముంబై మార్కెట్లో ఈరోజు ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,050కు చేరగా… 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ. 48,050కు చేరింది. అలాగే చెన్నైలోనూ 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 45,120కు చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,220కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు.. వాటి వడ్డీ రేట్లు జువెలరీ మార్కెట్.. వాణిజ్య యుద్ధాలు వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.
Keerthy Suresh: చెల్లెలి పాత్రకు కేరాఫ్‌గా ఈ అమ్మడు మారిపోతుందా..? అభిమానుల్లో ఆందోళన..
Puneeth Rajkumar: పునీత్ రామ్‌కుమార్ అకాల మరణం.. ప్రశ్నార్థకంగా మారిన రూ. 400 కోట్ల పెట్టుబడులు..