Gold Price Today: మగువలకు శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

|

Nov 04, 2022 | 10:11 AM

దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీపావళికి ముందు పరుగులు పెట్టిన బంగారం, వెండి రేట్లు ఇప్పుడు దిగి వస్తున్నాయి. దేశంలో బంగారానికి మహిళలు..

Gold Price Today: మగువలకు శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
Gold Price Today
Follow us on

దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. దీపావళికి ముందు పరుగులు పెట్టిన బంగారం, వెండి రేట్లు ఇప్పుడు దిగి వస్తున్నాయి. దేశంలో బంగారానికి మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. హిందూ సాంప్రదాయంలో పసిడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి రోజు బంగారం కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఇక పెళ్లిళ్లు, పండగలు, ఇతర శుభకార్యాలలో ఇక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. జ్యూలరీ షాపులన్నీ కిటకిటలాడుతుంటాయి. ఇక తాజాగా నవంబర్‌ 4వ తేదీని దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. 10 గ్రాముల బంగారంపై రూ.150 నుంచి రూ.160 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర పై రూ.800 తగ్గింది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు మాత్రమే నమోదైనవి. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు. అయితే ఈ ధరలు అన్ని రాష్ట్రాల్లో ధరలు ఒకేలా ఉండవు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల జీఎస్టీని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఇక దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

దేశీయంగా బంగారం ధరలు:

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,400గా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాలైన ఏపీ , తెలంగాణలోనూ పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 వద్ద ఉంది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

వెండి ధర:

ఇక కిలో వెండిపై రూ.800 వరకు తగ్గుముఖం పట్టింది. దేశీయంగా వెండి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ.64,000, ముంబైలో రూ.58,100, ఢిల్లీలో రూ.58,100, కోల్‌కతాలో రూ.58,100, బెంగళూరులో రూ.64,000, కేరళలో రూ.64,000, హైదరాబాద్‌లో రూ.64,000, విజయవాడలో రూ.64,000, విశాఖలో రూ.64,000 ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..