Gold Price Today: మగువలకు బ్యాడ్ న్యూస్..! మళ్లీ పెరిగిన బంగారం ధరలు..! తులం గోల్డ్ రేట్ ఎంతంటే..?

Gold Price Today: దేశంలో మళ్లీ బంగారం పరుగులు పెడుతోంది. గత నెలలో దిగివచ్చిన పసిడికి ఇప్పుడు రెక్కలొచ్చాయి.

Gold Price Today: మగువలకు బ్యాడ్ న్యూస్..!  మళ్లీ పెరిగిన బంగారం ధరలు..! తులం గోల్డ్ రేట్ ఎంతంటే..?
Gold Price

Updated on: May 09, 2021 | 7:12 AM

Gold Price Today: దేశంలో మళ్లీ బంగారం పరుగులు పెడుతోంది. గత నెలలో దిగివచ్చిన పసిడికి ఇప్పుడు రెక్కలొచ్చాయి. రోజురోజుకు పెరుగుతూ బంగారం కొనుగోలు చేసేవారికి షాకిస్తోంది. తాజాగా ఆదివారం 10 గ్రాములపై రూ.80 నుంచి 100 వరకు పెరిగింది. అయితే దేశంలో ఒక్కో నగరంలో ఒక్కో విధంగా పెరుగుతోంది. దేశీయంగా చూస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660 వద్ద కొనసాగుతోంది.

ప్రధాన నగరాల్లో తాజా ధరల వివరాలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,990 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,100 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,200 వద్ద ఉంది.

ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,200 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,650 వద్ద కొనసాగుతోంది. ఇక కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660 ఉంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, కరోనా, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. అయితే బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. బంగారం కొనుగోలు చేసే వారు ధరలను తెలుసుకొని వెళ్లడం మంచిది.

Horoscope Today : ఈ రాశివారు ఆస్తుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.. మే 9న రాశిఫలాలు ఇలా ఉన్నాయి..

MOTHERS DAY SPECIAL : మదర్స్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా..! దీని వెనుకున్న చరిత్ర తెలిస్తే చేతులెత్తి మొక్కుతారు..