Gold Price Today: భగ్గుమంటున్న బంగారం ధరలు.. తాజాగా 10 గ్రాములపై ఎంత పెరిగిందంటే..!

| Edited By: Anil kumar poka

Nov 29, 2021 | 6:03 PM

Gold Price Today: మళ్లీ బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్న పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. దేశంలో మహిళలు బంగారానికి..

Gold Price Today: భగ్గుమంటున్న బంగారం ధరలు.. తాజాగా 10 గ్రాములపై ఎంత పెరిగిందంటే..!
Follow us on

Gold Price Today: మళ్లీ బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్న పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. దేశంలో మహిళలు బంగారానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్‌లో అయితే చెప్పనవసరం లేదు. బంగారం ధరలు పెరిగేందుకు ఎన్నో కారణాలు ఉన్నా.. కొనుగోళ్లు మాత్రం ఆగవు. ప్రతి రోజు పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఆదివారం (నవంబర్‌ 28)న దేశంలో బంగారం ధరలు పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధరపై రూ.370 వరకు పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,490గా ఉంది.

►దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,310గా ఉంది.

► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,350 ఉంది.

► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700 ఉంది.

► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150 ఉంది.

► కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150 వద్ద కొనసాగుతోంది.

►విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,150గా ఉంది.

► విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,050 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,150వద్ద కొనసాగుతోంది.

అయితే ప్రతి రోజు బంగారం ధరలు పెరుగుదలకు ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఉదయం 6 గంటలకు నమోదైనవి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మీరు బంగారం కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

BSNL Lifetime Plan: కస్టమర్లకు బీఎస్‌ఎన్‌ఎల్‌ షాక్‌.. లైఫ్‌టైమ్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌లు రద్దు.. మరి ఎలా..?

Two Wheeler: ద్విచక్ర వాహనాలను ఫైనాన్స్‌లో కొనుగోలు చేస్తే మంచిదా.? కాదా..? నిపుణులు ఏమంటున్నారంటే..!

Recharge Plans: మొబైల్‌ యూజర్లకు షాక్‌.. పెరిగిన ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌ ధరలు.. పూర్తి వివరాలు