
గోల్డ్ లవర్స్‌కి అద్దిరిపోయే న్యూస్. పెరిగినట్టే.. పెరిగి.. అమాంతం తగ్గాయ్ బంగారం ధరలు. స్థిరంగా కొనసాగుతూ.. ఆ తర్వాత వరుసగా మూడు రోజుల నుంచి పెరుగుతూపోతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. శుక్రవారం బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయ్. ఈ క్రమంలోనే బంగారాన్ని కొనేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది సుముఖత చూపిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పాడిన ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువలో మార్పు, స్టాక్ మార్కెట్లలో నెలకొన్న గడ్డుపరిస్థితులే.. బంగారం ధరల హెచ్చుతగ్గులకు కారణమని బిజినెస్ నిపుణులు అంటున్నారు. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ. 72,750గా ఉంది. అదే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం రేటు రూ. 66,690కు చేరింది. నిన్నటి ధరలతో పోలిస్తే తులంపై రూ. 10 తగ్గింది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పడు చూద్దాం.
హైదరాబాద్ – రూ. 72,750 విజయవాడ – రూ. 72,750 బెంగళూరు – రూ. 72,750 ముంబై – రూ. 72,750 చెన్నై – రూ. 73,410
హైదరాబాద్ – రూ. 66,690 విజయవాడ – రూ. 66,690 బెంగళూరు – రూ. 66,690 ముంబై – రూ. 66,690 చెన్నై – రూ. 67,290
ఇది చదవండి: సికింద్రాబాద్‌కి ‘వందే స్లీపర్’ రైళ్లు.. ఏ రూట్‌లో ఉండనుందంటే.?
బంగారం ధరల మాదిరిగానే వెండి ధరలలోనూ తగ్గుదల కనిపిస్తున్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే కేజీ వెండిపై రూ. 100 తగ్గింది. దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీతో పాటు కోల్‌కతా ముంబయి, పుణెలో వంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 96,400 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ. 95,600గా ఉంది. చెన్నై, హైదరాబాద్, కేరళ, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 1,00,900 వద్ద కొనసాగుతోంది.
ఇది చదవండి: SRHకి హిట్‌మ్యాన్.. RCBకి రాహుల్.. మెగా వేలంలోకి హేమాహేమీలు.! రిటైన్ లిస్టు ఇదిగో..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..