
Gold Price Today: మళ్లీ బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. తులం బంగారం కొనాలంటే లక్షా 35 వేలకు చేరువలో ఉంది. మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే తాజాగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నా యి. డిసెంబర్ 14న దేశీయంగా తులం బంగారం ధర రూ.1,34,000 వరకు ఉంది. అయితే దేశంలో గత నాలుగైదు రోజుల్లోనే తులం బంగారంపై దాదాపు 5 వేల వరకు ఎగబాకింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. అ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. 10 గంటల సమయంలో అప్‌డేట్ అవుతాయి. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.
ఇది కూడా చదవండి: SBI: ఎస్‌బీఐ రుణ రేట్లు తగ్గింపు.. గృహ, వ్యక్తిగత లోన్స్ చౌకగా.. EMIలో ఉపశమనం!
అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించిన తర్వాత బంగారం, వెండిపై పెట్టుబడులు పెరిగాయి. కీలక వడ్డీ రేట్లలో తగ్గుదల బాండ్ దిగుబడిని తగ్గిస్తుందని భావిస్తున్నారు, దీని వలన పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సురక్షితమైన ఆస్తులలో పెట్టుబడులు పెట్టడానికి దారితీస్తున్నారు.
ఈ సంవత్సరం ఇప్పటివరకు దేశీయ మార్కెట్లో బంగారం ధరలు 67% పెరిగాయి. ప్రపంచ పరిస్థితులు, రూపాయి-డాలర్ రేటు దాదాపుగా అలాగే ఉంటే లేదా బలహీనపడితే 2026లో బంగారం ధరలు మరో 5% నుండి 16% వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు అంతర్జాతీయ బంగారం ధరలు దాదాపు 60% పెరిగాయని లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Tata Motors: ఈ టాటా కారు కొత్త రికార్డు.. 29 కి.మీ మైలేజీ.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి