AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

Gold Price Today: ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉన్నాయి. అయితే, బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీపావళి నాటికి బంగారం గత రికార్డులన్నింటినీ బద్దలు..

Gold Price Today: పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
Today Gold Rate
Subhash Goud
|

Updated on: Sep 22, 2026 | 6:37 AM

Share

Gold, Silver Prices Today: బంగారం కొనేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. ఇటీవల గోల్డ్ రేటు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో శని, శుక్రవారాల్లోనూ ధర భారీగా పెరిగింది. అయితే, ఇవాళ మాత్రం గోల్డ్ రేటు కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే గత రెండు రోజుల్లో సుమారు వెయ్యి రూపాయల వరకు దిగి వచ్చింది.

ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉన్నాయి. అయితే, బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీపావళి నాటికి బంగారం గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి, 10 గ్రాములకు రూ.1.80 లక్షలను దాటవచ్చని కూడా వారు పేర్కొంటున్నారు.

తాజాగా మంగళవారం (సెప్టెంబర్‌ 22) దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు.

ఇది కూడా చదవండి: DMart: డీమార్ట్‌లో ఈ వస్తువులు కొంటే డబ్బు ఆదా.. MRP కంటే తక్కువ ధరకు లభించే బెస్ట్ ఐటమ్స్ ఇవే!

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,570 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,690 వద్ద కొనసాగుతోంది.
  2. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,570 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,690 వద్ద కొనసాగుతోంది.
  3. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,720 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,840 వద్ద కొనసాగుతోంది.
  4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,570 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,690 వద్ద కొనసాగుతోంది.
  5. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,570 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,690 వద్ద కొనసాగుతోంది.
  6. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,570 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,41,690 వద్ద కొనసాగుతోంది.
  7. ఇక వెండి విషయానికొస్తే.. ప్రస్తుతం కిలో గ్రాము వెండి ధర రూ.2,49,900 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ధర ఎంత?

వారంలోని మొదటి ట్రేడింగ్ రోజు అయిన సోమవారం, సెప్టెంబర్ 21న, అంతర్జాతీయ మార్కెట్ అయిన కామెక్స్‌లో బంగారం, వెండి రెండింటి ధరలు తగ్గాయి. కామెక్స్ డేటా ప్రకారం, బంగారం ధర 0.53% తగ్గి (కామెక్స్‌లో బంగారం ధర) ఔన్సుకు $4401.30కి చేరుకుంది. అదే సమయంలో వెండి ధరలు 0.48% తగ్గి ఔన్సుకు $66.825 వద్ద ట్రేడ్ ట్రేడయ్యాయి.

దేశీయ మార్కెట్‌లో పరిస్థితి ఏమిటి?

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు కూడా తగ్గాయి. MCX ఎక్స్ఛేంజ్‌లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.53 లక్షలకు పడిపోగా, కిలోగ్రాము వెండి ధర సుమారు రూ.2.40 లక్షలకు తగ్గింది.

ఇది కూడా చదవండి: UPI Payments: పెట్రోల్ పంపుల్లో రూ.2,000 కంటే ఎక్కువ UPI పేమెంట్లు బంద్? యజమానుల సంచలన నిర్ణయం!

ఇది కూడా చదవండి: Portable AC: అద్దె ఇంట్లో ఉంటున్నారా? గోడతో పనిలేకుండా చల్లటి గాలినిచ్చే పోర్టబుల్ ఏసీలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!