AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బంగారం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌.. పెరుగుతున్న ధరలు

Gold Price Today: మన దేశంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటాము. పెళ్లిళ్లు, శుభ కార్యలయాలకు బంగారానికి డిమాండ్‌ మరింతగా పెరుగుతుంది. ధరలు తగ్గినా, పెరిగిన బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. సాధారణ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా..

Gold Price Today: బంగారం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌.. పెరుగుతున్న ధరలు
రోజులలో బంగారం ధర లక్ష రూపాయలకు మించి పెరిగే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ కిషోర్ నార్నే అంచనా వేశారు. ఇక మార్నింగ్‌స్టార్‌కు చెందిన జాన్ మిల్స్ బంగారం ధరలు గ్రాముకు రూ.40,000 వరకు తగ్గవచ్చని అంచనా వేశారు. ఇది ప్రస్తుత ధర కంటే 38-40% తగ్గుదలను సూచిస్తుంది. అయితే, ప్రస్తుత మార్కెట్లో, అధిక సరఫరా, తక్కువ డిమాండ్ ఉంటే, బంగారం ధర తగ్గవచ్చని ఆర్థికవేత్తలు సూచించారు. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.95,670 వద్ద కొనసాగుతోంది.
Subhash Goud
|

Updated on: Feb 19, 2025 | 6:25 AM

Share

దేశంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రానున్నది పెళ్లిళ్ల సీజన్‌. మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో తులం బంగారం ధర లక్ష రూపాయల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పరుగులు పెడుతూనే ఉన్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది. తాజాగా ఫిబ్రవరి 19న దేశంలో బంగారం ధరలు పెరిగాయి. తులం బంగారంపై స్వల్పంగానే పెరిగినప్పటికీ ఇప్పటి వరకు భారీగానే పెరుగుతూ వస్తోంది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,710 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,960 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు బుధవారం ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

  1. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,960 ఉంది.
  2. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,960 ఉంది.
  3. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,860 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.87,110 ఉంది.
  4. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,960 ఉంది.
  5. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,960 వద్ద కొనసాగుతోంది.
  6. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,960 ఉంది.
  7. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,960 ఉంది.
  8. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.86,960 ఉంది.
  9. ఇక కిలో వెండి ధర ప్రస్తుతం లక్షా 400 రూపాయల వద్ద ఉంది.

సాధారణ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో అస్థిరత మరియు అమెరికన్ విధానాల కారణంగా, ప్రజలు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం కొనుగోలును పెంచుతున్నారు. దీని కారణంగా దాని ధర నిరంతరం పెరుగుతోంది. వడ్డీరేట్లను తగ్గించడంతోపాటు ప్రపంచ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగితే బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే, వివాహాలు, పండుగ సీజన్లలో వారి డిమాండ్ ఎక్కువగా ఉండవచ్చు. దీని కారణంగా ధరలు అధిక స్థాయిలో ఉండవచ్చు.

భారతదేశంలో బంగారం ధర వేర్వేరు నగరాల్లో మారుతూ ఉంటుంది. ఎందుకంటే దేశంలో బంగారం కోసం ఒకే రేటు ఇంకా నిర్ణయించలేదు. ఆయా ప్రాంతాల ట్యాక్స్‌ను బట్టి మార్పులు ఉంటాయని గుర్తించుకోండి. వివిధ రాష్ట్రాలు, నగరాల స్థానిక పన్నులు, ఆభరణాల తయారీ ఛార్జీలు కాకుండా, మరికొన్ని అంశాలు కూడా బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. సాధారణంగా దక్షిణాది నగరమైన చెన్నైలో బంగారం ధరలు వేగంగా పెరుగుతాయి లేదా తగ్గుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..