
బంగారం ధరలు కాస్త శాంతించాయనుకున్న తరుణంలో మళ్లీ ఒక్కసారిగా పెరుగుతున్నాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర ఈ ఏడాది చివరి నాటికి రూ. 80 వేలకు చేరడం ఖాయమన్న వార్తలకు ప్రస్తుతం పెరుగుతోన్న బంగారం ధరలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే తులం బంగారం ధర సుమారు రూ. 73వేలపైకి ఎగబాకింది. వరుసగా నాలుగో రోజు మరోసారి బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మరి దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దామా..
దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,260గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 73,360 వద్ద కొనసాగుతోంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 67,110కాగా,24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,210గా ఉంది.
ఇవి కూడా చదవండిచెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 67,760కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 73,920గా ఉంది.
కోల్‌కతాలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,110కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,210 వద్ద కొనసాగుతోంది.
ఇది చదవండి: మీకు రేషన్ కార్డు ఉందా.? ఇలా చేస్తే.. ప్రతీ నెలా రూ. 5 వేలు మీ సొంతం.!
హైదరాబాద్‌లో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,110కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,210గా ఉంది.
విజయవాడలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,110కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,210గా ఉంది.
విశాఖపట్నం విషయానికొస్తే ఇక్కడ కూడా ఈ రోజు హైదరాబాద్‌లో మాదిరిగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,110కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,210గా ఉంది.
వెండి ధరలు కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాయి. కిలో వెండి రూ. 100 వరకు పెరిగింది. పెరిగిన ధర తక్కువే అయినప్పటికే.. కిలో వెండి ధర.. దేశంలోని కొన్ని నగరాల్లో రూ. లక్ష దాటిపోవడం సామాన్యులను భయపెడుతోంది. ఢిల్లీతో పాటు, ముంబయి, కోల్‌కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 97,800గా ఉండగా హైదరాబాద్, చెన్నై, విజయవాడ, విశాఖలో అత్యధికంగా కిలో వెండి ధర రూ. 1,02,300కి చేరుకుంది.
ఇది చదవండి: కోహ్లీని సాకుగా చూపారు.. కట్ చేస్తే.. లక్షలు పోసికొన్న ప్లేయర్లను సాగనంపారు.!