Gold Prices Today(07-02-2021): పసిడి ప్రియులకు షాక్.. మళ్ళీ పెరిగిన బంగారం ధర.. ఎంతమేర అంటే..!
కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత దేశంలో చుక్కలనంటిన బంగారం ధరలు తగ్గు ముఖం పట్టాయి. గతంలో 56 వేల మార్కును తాకిన 10 గ్రాముల పసిడి ధర ప్రస్తుతం 48 వేలకు..
Gold Prices Today(07-02-2021): కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత దేశంలో చుక్కలనంటిన బంగారం ధరలు తగ్గు ముఖం పట్టాయి. గతంలో 56 వేల మార్కును తాకిన 10 గ్రాముల పసిడి ధర ప్రస్తుతం 48 వేలకు పడిపోయింది. అయితే దేశంలో గత ఐదు రోజులుగా గత తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్ళీ షాక్ ఇచ్చాయి. బడ్జెట్ తో తగ్గించిన దిగుమతి సుంకంతో పసిడి కొంత మేర దిగి వచ్చింది. అయితే బంగారం కొనుగోలు పెరిగితే..మళ్ళీ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించినట్లుగానే జరుగుతుంది. తాజాగా బంగారం ధరలు మళ్ళీ భారీగా పెరిగాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి రూ.44,050 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 పెరిగి రూ. 48, 060 కి చేరింది.
అందువల్ల ఇకపై బంగారం ధరలు పెరుగుతాయా, మరింత తగ్గుతాయా అన్నది లోతుగా విశ్లేషించుకోవాల్సిందే. బులియన్ మార్కెట్ నిపుణులైతే… మరింత తగ్గవచ్చని అంటున్నారు. ముదుపరులు మళ్లీ బంగారం ధర పెరుగుతుంది అంటున్నారు. ఎందుకంటే దేశంలో బంగారానికి డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. ఓ వైపు పెళ్లిళ్ల సీజన్ రానున్నది మరోవైపు ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. ఇవన్నీ కలిసి బంగారం కొనుగోళ్లు పెరిగేలా చేయనున్నాయని మార్కెట్ రంగ నిపుణులు అంచనావేస్తున్నారు.
Also Read: