Ramnath Kovind: నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. స్వాగతం పలకనున్న సీఎం జగన్‌

Ramnath Kovind: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం చిత్తూరులో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు మదనపల్లెకు చేరుకుంటారు...

Ramnath Kovind: నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.. స్వాగతం పలకనున్న సీఎం జగన్‌
Follow us
Subhash Goud

|

Updated on: Feb 07, 2021 | 7:54 AM

Ramnath Kovind: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం చిత్తూరులో పర్యటించనున్నారు. బెంగళూరు నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు మదనపల్లెకు చేరుకుంటారు. అక్కడ ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి ముందుగా మదనపల్లెలోని సుప్రసిద్ద తత్వవేత్త ముంతాజ్‌ అలీకి చెందిన సత్సంగ్‌ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. ఆశ్రమ నిర్మాణాలు, స్వస్థ్య ఆస్పత్రికి శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రపతి సుమారు మూడు గంటల పాటు అక్కడే గడుపుతారు. అనంతరం సదుం మండలంలోని ముంతాజ్‌ అలీ నిర్వహిస్తున్న పీపల్‌ గ్రో పాఠశాలకు చేరుకుంటారు. అక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.50 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బెంగళూరుకు బయలుదేరుతారు.

Also Read: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పునరాలోచన చేయండి… ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం వైఎస్‌ జగన్‌‌