బంగారం కొనేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తిచూపిస్తారు. అందున పండుగలు ఏవైనా ప్రత్యేక రోజులు వస్తే చాలు ఎగబడి కొనుగోలు చేస్తారు. అయితే నిన్న మన్నటి వరకూ ఆకాశాన్నంటిన పసిడి ధరలు ఈరోజు కూడా స్థిరంగానే కొనసాగుతోంది. నిన్నటి బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ద్రవ్యోల్భణంతో పాటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్ వడ్డీరేట్లలో వచ్చిన హెచ్చుతగ్గుల కారణంగా స్థిరంగా కొనసాగుతోంది. దీంతో పసిడి పరుగులకు బ్రేక్ పడి కొనాలనుకునే వారికి స్వల్ప ఊరట కలిగింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడులపై కాస్త హెచ్చుతగ్గులు కనిపించాయి. దీని ప్రభావం బంగారు ధరలపై పడింది.
నిన్న హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర నిన్న రూ.63,760 కాగా ఈరోజు కూడా అలాగే స్థిరంగా కొనసాగుతోంది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర నిన్న రూ. 58,450 ఉండగా ఈరోజు కూడా అదే విధంగా ట్రేడ్ అవుతోంది. పెద్దగా మార్పులు లేవు. ఇక వెండి విషయానికొస్తే నిన్న కిలో రూ. 83,500 కాగా ఈరోజు కూడా అదే ధరలో కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..