Gold Price Today: ఏమంటూ రష్యా, ఉక్రెయిన్‌ల (Russain Ukraine War) మధ్య యుద్ధం ప్రారంభమైందో దాని ప్రభావం ధరల రూపంలో ప్రపంచంపై పడింది. వంట నూనె నుంచి బంగారం వరకు అన్ని ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 10 గ్రాముల గోల్డ్ రేట్ ఆల్‌టైమ్ హైకి చేరుకొని ఏకంగా రూ. 52 వేలు దాటేసింది. ఇక గడిచిన రెండు రోజులుగా శాంతించిన బంగారం ధర ఆదివారం మరోసారి ఎగబాకింది. ఆదివారం దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో బంగారం ధరల్లో పెరుగుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా నేడు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 48,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,800 వద్ద కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ. 48,400 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,800 గా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో మాత్రం బంగారం ధర తగ్గింది. 22 క్యారెట్ల బంగారంపై రూ. 120 తగ్గి రూ. 48,940 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్‌పై రూ. 130 తగ్గి రూ. 53,390 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ. 48,400 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ. 52,800 వద్ద నమోదైంది.
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ. 48,400 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,800 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,800 గా ఉంది.
* సాగరతీరం విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ. 48,400 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల బంగారం రూ. 52,800 గా ఉంది.
Also Read: Bhavana: కిల్లింగ్ లుక్స్ తో కవ్విస్తున్న కుర్ర భామ భావన లేటెస్ట్ ఫోటోస్
AAP: పంజాబ్‌లో ఆప్ ప్రభంజనం.. ఆ రెండు రాష్ట్రాలపై కేజ్రీవాల్ పార్టీ ఫోకస్..
Samantha: మమ్మల్ని జడ్జ్ చేయడం మానేసి.. మీ పని మీరు చూసుకోండి.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన సమంత..