
Gold Price Update: బంగారం ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్నటితో పోలిస్తే భారీగా పెరిగిన బంగారం ధర.. ఉదయం 10 గంటల సమయానికి భారీగా తగ్గుముఖం పట్టింది. 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.800 వరకు దిగి వచ్చింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,850 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,17,200 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి విషయానికొస్తే కిలో వెండిపై అతి స్వల్పంగా అంటే వంద రూపాయలు పెరిగి ప్రస్తుతం రూ.1,73,100 వద్ద కొనసాగుతుంది. ఇదిలా ఉంటే, నిన్న వెండి ధర భారీ స్థాయిలో పెరిగింది. ఏకంగా 10 వేల రూపాయల వరకు ఎగబాకింది. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో తులం బంగారంపై 800 రూపాయలు తగ్గి ప్రస్తుతం రూ.1,27,850 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడలోనూ ఇతర ధర కొనసాగుతోంది. ఇక ఢిల్లీలోనూ తులం బంగారం ధర రూ.1,28,000 ఉండగా, అదే ముంబైలో రూ.1,27,850 వద్ద కొనసాగుతోంది.
డాలర్ విలువ పెరిగే కొద్దీ బంగారం ధర తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం డాలర్ విలువ పెరిగే కొద్దీ అమెరికా ఫెడరల్ రిజర్వు జారీ చేసే ట్రెజరీ బాండ్లను పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే అమెరికా జారీ చేసే ఈ ట్రెజరీ బాండ్ల పైన రాబడి అందిస్తుంది.
ఇది కూడా చదవండి: Supreme Court: ఇళ్లల్లో అద్దెకు ఉండేవారిపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి