Gold Price Today: మగువలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి.. తాజా రేట్ల వివరాలు

|

Nov 23, 2022 | 6:26 AM

బంగారం.. ఇది మహిళలకు ఎంతో ఇష్టమైనది. పసిడికి భారతదేశంలో ప్రత్యేక స్థానముంది. ఇందుకే భారతీయ మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత..

Gold Price Today: మగువలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. పెరిగిన వెండి.. తాజా రేట్ల వివరాలు
Today Gold Price
Follow us on

బంగారం.. ఇది మహిళలకు ఎంతో ఇష్టమైనది. పసిడికి భారతదేశంలో ప్రత్యేక స్థానముంది. ఇందుకే భారతీయ మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇందుకే ప్రపంచంలోనే బంగారం వినియోగంలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఆభరణాలు, పెట్టుబడికి బలమైన డిమాండ్ కారణంగా, ప్రతి సంవత్సరం వందల టన్నులకొద్ది బంగారం దిగుమతి అవుతోంది. బంగారం ధరల్లో ప్రతి రోజు మార్పులు ఉంటాయి. ఒక రోజు తగ్గితే మరోరోజు పెరుగుతుంది. దీపావళి నుంచి పరుగులు పెడుతున్న బంగారం.. తాజాగా నవంబర్‌ 23న స్వల్పంగా దిగి వచ్చింది. తులం బంగారంపై రూ.170 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక బంగారం మాట అటుంచితే.. వెండి మాత్రం పరుగులు పెడుతోంది. కిలో వెండిపై స్వల్పంగా అంటే రూ.600 వరకు పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.

దేశంలో బంగారం ధరలు

➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,050 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,510 వద్ద నమోదైంది.

➦ ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.48,350 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.52,750 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి

➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.48,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,900 ఉంది.

➦ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉంది.

➦ బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.48,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,750 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 వద్ద కొనసాగుతోంది.

➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,350 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,750 వద్ద కొనసాగుతోంది.

➦ విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,35 0 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,750 ఉంది.

వెండి ధర:

➦ చెన్నైలో కిలో వెండి ధర రూ.67,000, ముంబైలో రూ.61,120, ఢిల్లీలో రూ.61,000, కోల్‌కతాలో కిలో వెండి రూ.61,200, బెంగళూరులో రూ.67,000, హైదరాబాద్‌లో రూ.67,000, విశాఖలో రూ.67,000 వద్ద ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..