Gold Price Today: వరుసగా మూడో రోజు తగ్గిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే

|

Oct 13, 2022 | 7:27 AM

రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు వరుసగా మూడోరోజు కూడా స్వల్పంగా తగ్గింది. ముందు రోజుతో పోలిస్తే దాదాపు 22, 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు సుమారు రూ.25వరకు తగ్గుదల కనిపించింది. దీంతో గత మూడురోజులు కలిపి దాదాపు..

Gold Price Today: వరుసగా మూడో రోజు తగ్గిన పసిడి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
Gold And Silver Today
Follow us on

రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు వరుసగా మూడోరోజు కూడా స్వల్పంగా తగ్గింది. ముందు రోజుతో పోలిస్తే దాదాపు 22, 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు సుమారు రూ.25వరకు తగ్గుదల కనిపించింది. దీంతో గత మూడురోజులు కలిపి దాదాపు గ్రాముకు బంగారం ధర రూ.115 తగ్గినట్లయింది. బంగారం కొనాలనుకునే వారు ఎప్పుడు ధర దిగివస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. ధర తగ్గినప్పుడు పసిడి కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తుంటారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గర ఉన్న బంగారమే మన ఆస్తి అవుతుందని చాలా మంది పేద, మధ్య తరగతి ప్రజలు సైతం బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అదే కొంత ఉన్నత వర్గాలకు, ధనిక కుటుంబాలకు చెందిన వారైతే.. మార్కెట్లోకి వచ్చే నూతన మోడల్స్ ను కొనుగోలు.. ఆ ఆభరణాలతో తమను అలంకరించుకుంటారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు బంగారం కొనేటప్పుడు చూసేది ధర, గతంలో ధర ఎలా ఉంది, భవిష్యత్తులో తగ్గుతుందా, పెరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా గత కొద్దిరోజులుగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసి పెరిగితే కొద్ది రోజులు ఆగుదామని, ధర కొంత తగ్గుదల కొనిపిస్తే వెంటనే కొనుగోలు చేయడం చేస్తుంటారు. మరి ఈరోజు (13 అక్టోబర్ 2022) బంగారం, వెండి ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో సహా, దేశంలోని ప్రధాన నగరాల్లో ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

బంగారం ధరలు ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు, నగల మార్కెట్‌లతో సహా అనేక పరిణామాల ప్రభావం బంగారం, వెండి ధరలపై ఆధారపడి ఉంటాయి. అక్టోబర్ 12వ తేదీ మంగళవారంతో పోలిస్తే అక్టోబర్ 13వ తేదీ గురువారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర

హైదరాబాలో 22 క్యారెట్ల బంగారం ధర చూసుకుంటే బుధవారం ధరతో పోలిస్తే గురువారం బంగారం ధరలో రూ.25 తగ్గుదల కనిపించింది. గ్రాము బంగారం ధర బుధవారం రూ.4,665గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.46,650గా ఉంది. 24 క్యారెట్ల బంగారం కూడా బుధవారంతో పోలిస్తే గురువారం ధర గ్రాముకు రూ.27 మేర తగ్గింది. గ్రాము బంగారం ధర 5,089గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర రూ.50,890గా ఉంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నంతో పాటు తెలంగాణలోని వరంగల్ లో కూడా కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

వివిధ నగరాలలో బంగారం ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో కూడా 22, 24 క్యారెట్ల బంగారానికి సంబంధించి బుధవారంతో పోలిస్తే గురువారం తగ్గుదల ఉంది. 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 4,680గా ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.46,800గా ఉంది. 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర ఢిల్లీలో రూ.5,105గా ఉంది. అదే పది గ్రాముల బంగారం అయితే రూ.51,050గా ఉంది.

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు (గురువారం) రూ.4,665గా ఉంది. అదే పది గ్రాముల బంగారం ధర రూ.46,650గా ఉంది. ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.5,089గా ఉంది. పది గ్రాముల బంగారం ధర రూ.50,890గా ఉంది.

దేశంలో అన్ని ప్రధాన నగరాల్లో కంటే చెన్నైలో పసిడి ధరలు అధికంగా ఉన్నాయి. గురువారం (అక్టోబర్13) గ్రాము బంగారం ధర రూ. 4,730గా ఉండగా, పది గ్రాముల బంగారం ధర చెన్నైలో రూ.47,300గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే బుధవారంతో పోలిస్తే గురువారం గ్రాము బంగారం ధర రూ.11 తగ్గింది. దీంతో గ్రాము బంగారం ధర రూ.5,160కు చేరుకోగా, పది గ్రాముల బంగారం ధర రూ.51,600గా ఉంది.

దేశంలో వెండి ధరలు

దేశీయంగా పసిడి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించగా.. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. మన దేశంలో పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పూజలు వంటి సమయంలో వెండి వస్తువుల ఖరీదుకి ఆసక్తిని చూపిస్తారు. బుధవారం ధరలతో పోలిస్తే గురువారం వెండి ధర కిలోకు రూ.1000 తగ్గింది. దీంతో హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తెలంగాణలోని వరంగల్ నగరాల్లో నేడు వెండి ధర కిలో రూ.63,000గా ఉంది. వెండి ధర గత మూడు రోజులు కలిపి కిలోకు దాదాపు రూ.3000 తగ్గింది.

Note: పైన పేర్కొన్న బంగారం ధరలు GST, TCS వంటివి కలిపిన ధరలు కావు.. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల వ్యాపారిని సంప్రదించాల్సి ఉంటుంది. ఈ పసిడి వెండి ధరలు.. ఈ రొజు ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అయితే ఈ ధరలలో హెక్చుతగ్గులు స్థానిక పరిస్థితిని బట్టి కూడా ఏర్పడవచ్చు. కొనుగోలు దారులు ఈ విషయాన్నీ గమనించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..