Gold, Silver Price Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. పెరిగిన బంగారం, వెండి ధరలు..!

|

Apr 13, 2022 | 6:29 AM

Gold, Silver Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత నాలుగైదు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న ధరలు.. మళ్లీ ఎగబాకుతున్నాయి. ఉక్రెయిన్‌-రష్యా దాడుల..

Gold, Silver Price Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. పెరిగిన బంగారం, వెండి ధరలు..!
Follow us on

Gold, Silver Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత నాలుగైదు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న ధరలు.. మళ్లీ ఎగబాకుతున్నాయి. ఉక్రెయిన్‌-రష్యా దాడుల నేపథ్యంలో బంగారం (Gold), వెండి (Silver) ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. తర్వాత తగ్గుముఖం పట్టాయి. భారతదేశంలో పసిడికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.అయితే తాజాగా 10 గ్రాముల బంగారంపై రూ.400లకు పెరిగాయి. ఇక బుధవారం (April 13)న దేశీంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,450 వద్ద ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,450 ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,470 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,000 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,450 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,450 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,450 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,450 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,450 వద్ద ఉంది.

వెండి ధరలు..

ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. దేశీయంగా వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,700 ఉండగా, విజయవాడలో రూ.72,700 ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.72,700 ఉండగా, ముంబైలో రూ.67,800 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.67,800 ఉండగా, కోల్‌కతాలో రూ.67,800 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.72,700 ఉండగా, కేరళలో రూ.72,700 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

Gold News: సర్వేలో బయటపడ్డ షాకింగ్ నిజాలు .. దేశంలో బంగారాన్ని ఎక్కువగా కొంటోంది వారే..

MG Motor India: ఎంజీ మోటార్స్‌ ఇండియా కీలక నిర్ణయం.. చిన్న ఎలక్ట్రిక్‌ వాహనాలు..!