పసిడి ప్రియులకు శుభవార్త.. ముచ్చటగా మూడో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే?

బంగారం కొనాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్. వరుసగా మూడో రోజు కూడా బులియన్ మార్కెట్లో బంగారం ధర భారీగా తగ్గుతోంది. బంగారం ధర తగ్గే వరకు వేచి చూస్తున్న పసిడి ప్రియులకు ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. ఫెడరల్ రిజర్వ్ ముఖ్యమైన సమావేశం, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలను పెట్టుబడిదారులు గమనిస్తున్నారు. అందుకే ఈ సమయంలో స్టాక్ మార్కెట్, కమోడిటీ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఇది బులియన్ మార్కెట్‌ను అంటే బంగారం, వెండి వ్యాపారాన్ని కూడా ప్రభావితం చేసింది.

పసిడి ప్రియులకు శుభవార్త.. ముచ్చటగా మూడో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే?
Gold

Updated on: Aug 21, 2025 | 7:40 AM

బంగారం కొనాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్. వరుసగా మూడో రోజు కూడా బులియన్ మార్కెట్లో బంగారం ధర భారీగా తగ్గుతోంది. బంగారం ధర తగ్గే వరకు వేచి చూస్తున్న పసిడి ప్రియులకు ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. ఫెడరల్ రిజర్వ్ ముఖ్యమైన సమావేశం, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలను పెట్టుబడిదారులు గమనిస్తున్నారు. అందుకే ఈ సమయంలో స్టాక్ మార్కెట్, కమోడిటీ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఇది బులియన్ మార్కెట్‌ను అంటే బంగారం, వెండి వ్యాపారాన్ని కూడా ప్రభావితం చేసింది. గురువారం కూడా బంగారం, వెండి ధరలలో స్వల్ప తగ్గుదల కనిపించింది. ధరల తగ్గుదల కారణంగా ఇవాళ్టి గోల్డ్‌, సిల్వర్ మునుపటి కంటే కొంచెం చౌకగా మారాయి. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,140గా ఉంది. 22 క్యారెట్‌ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,790గా ఉంది. ఇక కిలో కిలో వెండి ధర రూ. 1,24,900లకు చేరుకుంది.

– ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,00,290లుగా ఉంది. అదే 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.91,940లుగా ఉంది.

– ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.,100,140లుగా ఉంది. అదే 22 క్యారెట్ల ధర రూ.91,790 ఉంది.

ఇవి కూడా చదవండి

– చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,00,140ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.91,790 గా ఉంది.

– బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,00,140లు ఉండగా, అదే 22 క్యారెట్ల ధర రూ.91,790 గా ఉంది.

– హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పదిగ్రాముల ధర రూ.1,00,140 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.91,790 లుగా ఉంది.

– విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,01,180, 22 క్యారెట్ల ధర రూ.92,750 లుగా ఉంది.

ఇక, ఇవాళ్టి వెండి ధర విషయానికి వస్తే.. పసిడితో పాటుగానే వెండి ధర కూడా తగ్గుముఖం పట్టింది. వెండి గ్రాము ధర రూ.124.90లు ఉండగా, కిలో వెండి ధర రూ. 1,24,900లు ధర పలుకుతోంది.

గమనిక, బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..