ఆహారం తిన్న వెంటనే టీ తాగుతున్నారా..? అయితే, మీరు రిస్క్‌లో పడినట్టే..!
మన దేశంలో చాలా మందికి టీ తాగడం అంటే ఇష్టం. అలాగే, ఎక్కువ మంది ఆహారం తిన్న వెంటనే టీ తాగడానికి ఇష్టపడతారు. అటువంటి పరిస్థితిలో, మీరు ఆహారం తిన్న తర్వాత టీ తాగాలా వద్దా అని ఎప్పుడైనా ఆలోంచారా.? ఇలా భోజనం తరువాత కాఫీ, టీ తాగితే ఏమౌతుంది.? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం...

నిపుణుల అభిప్రాయం ప్రకారం, తిన్న వెంటనే టీ తాగడం శరీరానికి హానికరం. టీ ఆకులలో ఉండే ఆమ్ల మూలకాల కారణంగా తిన్న తర్వాత దీన్ని తాగడం వల్ల కడుపులో ఆమ్ల స్థాయి పెరుగుతుంది. దీనివల్ల గ్యాస్ చికాకు, కొన్నిసార్లు కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇది కాకుండా, ఆహారం తిన్న వెంటనే టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.
ఆహారం తిన్న వెంటనే టీ తాగడం వల్ల ఆహారంలో ఉండే ఇనుము శరీరానికి సరిగ్గా చేరదు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఎక్కువగా ఈ సమస్యకు గురవుతారు. టీలో ఉండే ఫాస్పోరిక్ ఆమ్లం ఎముకల ఆరోగ్యానికి హానికరం. కెఫిన్ రక్తపోటును పెంచుతుంది. ఇది కాకుండా, భోజనం తర్వాత టీ తాగడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది. అంతేకాదు పలు అధ్యయనాలు కూడా టీ, కాఫీ ఎక్కువగా తాగడం వల్ల డయాబెటిస్ వస్తుందని వెల్లడించాయి.
రోజుకు రెండుసార్లు కంటే ఎక్కువసార్లు చక్కెర టీ, కాఫీ తాగేవారికి ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని, మధుమేహం వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటుగా శీతల పానీయాలు కూడా ఆరోగ్యానికి హానికరం అంటున్నారు. శీతాలపానీయాలు తీసుకునే వారికి టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








