AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold and Silver Prices: మగువలకు శుభవార్త.. పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గిందంటే..!

Gold, Silver Price Today: ప్రస్తుతం బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతోంది. అయితే మన భారతీయ సాంప్రదాయంలో బంగారం ధరలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రస్తుతం బంగారం..

Gold and Silver Prices: మగువలకు శుభవార్త.. పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గిందంటే..!
Today Gold Price
Subhash Goud
|

Updated on: Jan 03, 2026 | 12:34 PM

Share

Gold and Silver Prices: కొత్త సంవత్సరం మొదటి వారంలో బంగారం, వెండి ధరలు గణనీయమైన హెచ్చుతగ్గులను చవిచూశాయి. ఇండియా బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) డేటా ప్రకారం ఈ వారం బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయి. ఐదు రోజుల ట్రేడింగ్‌లో బంగారం 10 గ్రాములకు రూ.1,990 వరకు తగ్గింది. అదే సమయంలో వెండి కూడా భారీగానే తగ్గింది. పది గ్రాములకు రూ.890 వరకు తగ్గింది.

అయితే ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 380 రూపాయలు తగ్గింది. అలాగే 22 క్యారెట్లపై 280 రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. ఇక వెండి విషయానికొస్తే.. ఇక్కడ మాత్రం భారీగా తగ్గింది. కిలో వెండిపై ఏకంగా 4000 రూపాయల వరకు దిగి వచ్చింది.

ప్రస్తుతం ధరలు:

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,820 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,500 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర తగ్గిన తర్వాత రూ.2,40,000 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో రూ.2,56,000 వద్ద కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,970 గా నమోదవగా, కిలో వెండి ధర రూ.2.40 లక్షల వద్ద స్థిరంగా ఉంది. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో పన్నులు మరియు రవాణా ఖర్చుల దృష్ట్యా ఈ ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నప్పటికీ, మొత్తంగా బులియన్ మార్కెట్ నేడు నష్టాల్లోనే ముగిసింది. రానున్న రోజుల్లో గ్లోబల్ మార్కెట్ ఒడిదుడుకులను బట్టి ఈ ధరలు మరింత మారే అవకాశం ఉంది.

2025 Billionaires: గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల.. చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?

మీ మొబైల్‌లో బంగారం ధరను తనిఖీ చేయండి:

మీరు మీ మొబైల్ ఫోన్‌లో బంగారం రిటైల్ ధరను కూడా తనిఖీ చేయవచ్చు. 8955664433 కు మిస్డ్ కాల్ ఇవ్వండి, మీకు సందేశం వస్తుంది. బంగారం ధర సమాచారం మీకు SMS ద్వారా అందుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి