Gold And Silver Price: నేటి మార్కెట్ లో స్థిరంగా ఉన్న పసిడి ధర.. తగ్గిన వెండి.. తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాల్లోకి వెళ్తే..!

|

Mar 25, 2021 | 7:25 AM

మనదేశంలో బంగారం ఓ ఆభరణమే కాదు.. అవసరానికి ఉపయోగపడే ఓ ఆర్ధిక వనరు కూడా.. ఇక కరోనా సమయంలో ఆల్ టైం గరిష్ఠానికి చేరుకున్న పసిడి.. గత కొన్ని రోజులుగా మెల్లగా...

Gold And Silver Price: నేటి మార్కెట్ లో స్థిరంగా ఉన్న పసిడి ధర.. తగ్గిన వెండి.. తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాల్లోకి వెళ్తే..!
Gold And Silver
Follow us on

Gold And Silver Price Today: మనదేశంలో బంగారం ఓ ఆభరణమే కాదు.. అవసరానికి ఉపయోగపడే ఓ ఆర్ధిక వనరు కూడా.. ఇక కరోనా సమయంలో ఆల్ టైం గరిష్ఠానికి చేరుకున్న పసిడి.. గత కొన్ని రోజులుగా మెల్లగా దిగి వచ్చింది. అయితే గోల్డ్ ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో సామాన్యులనుంచి ఆర్ధిక నిపుణుల వరకూ అంచనా వేయలేకుండా ఉన్నారు. అయితే గత రెండు రోజులుగా స్వల్పంగా బంగారం, వెండి ధరలు తగ్గుతూ వచ్చాయి. అయితే ఈరోజు (మార్చి 25 ఉదయం) మాత్రం పసిడి ధర స్థిరంగా ఉంది.. ఇక వెండి మాత్రం స్వల్పంగా తగ్గింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..!

హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం పసిడి ధర నిలకడగానే ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.45,700కి చేరింది. కాగా హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,700గా ఉంది. అదేసమయంలో హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 41,900కి చేరింది. కాగా హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 41,900గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 41,900గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 45,700గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,020గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.45,020గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,060గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,060గా ఉంది.

ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,270గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,870గా ఉంది.

ఇక పెళ్లిళ్లకు ఫంక్షన్లకు బంగారం తర్వాత వెండి ముఖ్య పాత్ర పోషిస్తుంది. నేటి వెండి ధరలు (25-మార్చి -2021) హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.69,700గా ఉంది. బుధవారం తో పోలిస్తే కిలో వెండి రూ. 700 తగ్గింది. ఇక తులం వెండి ధర ప్రస్తుతం రూ. 670 గా ఉంది.

అయితే బంగారం ధరలో హెచ్చుతగ్గులపై అనేక అంశాలు ప్రభావం చూపుతాయి.. అంతర్జాతీయ మార్కెట్, దేశీయ కొనుగోళ్లు, డాలర్ మారకం వంటి అనేక కారణాలతో ధరల్లో హెచ్చుతగ్గులుంటాయి. కనుక బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు నిత్యం మార్కెట్ లో పసిడి ధరలను పరిశీలించాల్సి ఉందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: ధనం, వ్యాపారం లో ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.. ఆరోగ్యం, వ్యాపార లాభాల కోసం ఏ దేవుని పూజ చేయాలంటే..

 చేవెళ్లలో దారుణం.. సెల్‌ఫోన్‌లో మాట్లాడొదన్నందుకు బీఫార్మసీ విద్యార్థిని..