Gold Silver Price Today: మహిళలకు బ్యాడ్ న్యూస్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

Gold Silver Price Today: బంగారం కొనుగోలు చేసే మహిళలకు బ్యాడ్‌న్యూస్‌. దేశంలో వరుసగా రెండో రోజు పసిడి ధరలు పెరిగాయి. శుక్రవారం తులం బంగారంపై రూ. 430 వరకు పెరగ్గా.. ఈరోజు మరో రూ.250 మేర పెరిగింది.

Gold Silver Price Today: మహిళలకు బ్యాడ్ న్యూస్‌.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
Gold Price

Updated on: Jun 18, 2022 | 6:28 AM

Gold Silver Price Today: బంగారం కొనుగోలు చేసే మహిళలకు బ్యాడ్‌న్యూస్‌. దేశంలో వరుసగా రెండో రోజు పసిడి ధరలు పెరిగాయి. శుక్రవారం తులం బంగారంపై రూ. 430 వరకు పెరగ్గా.. ఈరోజు మరో రూ.250 మేర పెరిగింది. ఇక వెండి కూడా పసిడి బాటలోనే పయనిస్తోంది. తాజాగా కిలో వెండిపై రూ. 350 వరకు పెరిగింది. కాగా అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మరి శనివారం (జూన్‌ 17)న దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

☛హైదరాబాద్‌: 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.47,750గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.52,120 పలుకుతోంది

☛ విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

☛ విశాఖపట్నం : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 పలుకుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100 వద్ద ఉంది.

☛ చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52, 180పలుకుతోంది.

☛ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 వద్ద కొనసాగుతోంది.

☛ ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,780గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,120పలుకుతోంది.

☛ కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440 వద్ద ఉంది.

☛ బెంగళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,780గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,120 పలుకుతోంది.

☛ కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100 వద్ద ఉంది.

బంగారం బాటలోనే సిల్వర్‌..

వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.66,000గా ఉంది. ఇక విజయవాడ, విశాఖ, చెన్నై నగరాల్లోనూ ఇదే ధర వద్ద వెండి కొనసాగుతోంది. ముంబైలో రూ.61,500, ఢిల్లీలో రూ.61,500, కోల్‌కతాలో రూ.61,500 బెంగళూరులో రూ.66,000, కేరళలో రూ.66,000 పలుకుతున్నాయి.

గమనిక:
బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజూ మార్పులు ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, జ్యువెలరీ మార్కెట్లలో నగలకు డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి బంగారం, వెండిని కొనుగోలు చేయలనుకునేవారు ఈ అంశాలన్నింటినీ పరిశీలించుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..